ఆగిరిపల్లి: మండలంలోని తాడేపల్లి చొప్పరమెట్ల సరిహద్దులో ఉన్న కొండపోరంబోకు గట్టుపై గ్రావె ల్ తవ్వకాలను బుధవారం జిల్లా మైనింగ్, విజిలెన్స్ శాఖ అధికారులు పరిశీలించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో రైతులు గ్రావెల్ తవ్వకాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ నెల 16న ‘గ్రావెల్ తవ్వకాలపై ఆందోళన’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కొండ పోరంబోకు గట్టుపై తవ్వకాలు, క్వారీకి కేటాయించిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎంతమేర తవ్వకాలు జరిపారన్నది ఉన్నతాధికారులకు నివేదిస్తామని, అనుమతులు లేవని తేలితే క్వారీ నిర్వాహకులు పై చర్యలు తీసుకుంటామ న్నారు. తనిఖీల్లో మైనింగ్ ఆర్‌ఐ శ్రీనివాస్ ప్రసాద్, మైనింగ్ సర్వేయర్ శ్రీనివాసరావు, మనీషా, రెవెన్యూ అధికారులు ఉన్నారు.


