ఆగిరిపల్లి: బిర్యానీకి కోసం హోటల్‌కి వెళ్లిన వ్యక్తి పది రూపాయలు తక్కువ ఇవ్వడంతో మొదలైన వివాదం చివరికి హోటల్ యజమాని, సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేసే వరకు వివాదం దారి తీసింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఆగిరిపల్లి శివారులో తులిమిల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి రెస్టారెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం పోతవరప్పాడు గ్రామానికి చెందిన వ్యక్తి బిర్యాని కోసం వచ్చి పది రూపాయలు తక్కువగా చెల్లించాడు. రెస్టారెంట్ యజమాని కుమారుడు రూ.10 తక్కువగా ఇచ్చావు అనడంతో వివాదం మొదలై ఇరువురు ఘర్షకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు వచ్చి ఇరువురికి సర్ది చెప్పి పంపించి వేశారు. సాయంత్రం మరలా పోతవరప్పాడు గ్రామానికి చెందిన వ్యక్తి హోటల్ వద్దకి 15 మందిని తీసుకువచ్చి హోటల్ యజమాని శ్రీనివాసరావు, కుమారుడు రాజేష్, హోటల్ సిబ్బంది మంటూ, రాకేష్‌పై బీరు సీసాలు, కరల్రతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా హోటల్‌లో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై నాగరాజు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నూజివీడు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆగిరిపల్లిలో సంచలనం రేకెత్తించింది.
రెస్టారెంట్ యజమానిపై దాడి


