ట్రిపుల్‌ఐటీలో ఏడాదికో తీరు | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీలో ఏడాదికో తీరు

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

న్యూస్‌రీల్‌

రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల నిర్వహణలో రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) తీరు గందరగోళంగా మారింది. అధికారుల నిర్ణయాలు ఏడాదికొకసారి మారుతుండటంతో విద్యార్థులు, ఫ్యాకల్టీలో అయోమయం నెలకొంది. అధికారుల అనుభవలేమి, ముందస్తు ప్రణాళికలు కరువవడంతో స్థిరమైన అకడమిక్‌ విధానాలు అమలుకు నోచుకోవడంలేదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026

నూజివీడు: నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో విద్యాబోధన, పరీక్షల నిర్వహణలో ఏకరూపత తేవాలనే ఉద్దేశంతో గత ఏడాది ఆర్జీయూకేటీ ‘కేంద్రీకృత పరీక్ష విధానం’తో పాటు పీయూసీకి ‘సెంట్రల్‌ కోఆర్డినేటర్‌’వ్యవస్థను ప్రవేశపెట్టింది. అకడమిక్‌ కౌన్సిల్‌ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా.. ప్రతి సబ్జెక్టుకు ఒక కోఆర్డినేటర్‌ను నియమించారు. అన్ని క్యాంపస్‌లకు సిలబస్‌ నిర్ణయించడం, మిడ్‌ టర్మ్‌ పరీక్షలతో సహా ఉమ్మడి ప్రశ్నపత్రాలను రూపొందించడం వారి బాధ్యత. కానీ, ఈ విధానం ఏడాది తిరగకముందే అటకెక్కింది.

ఎవరికి వారే.. యమునా తీరే : గతేడాది తీసుకువచ్చిన ఈ కేంద్రీకృత వ్యవస్థకు ఉన్నపళంగా స్వస్తి పలికిన అధికారులు.. తాజాగా పాత పద్ధతినే తెరపైకి తెచ్చారు. ఇకపై మిడ్‌ టర్మ్‌ పరీక్షలను ఆయా ట్రిపుల్‌ ఐటీలే సొంతంగా నిర్వహించుకోవాలని ఆదేశించారు. దీంతో ఒకే విశ్వవిద్యాలయం పరిధిలోని నాలుగు క్యాంపస్‌లలో పరీక్షల విషయంలో ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మరోవైపు సిలబస్‌ సకాలంలో పూర్తికాకపోవడంతో క్యాంపస్‌ల మధ్య పరీక్షల షెడ్యూళ్లలో తీవ్ర వ్యత్యాసాలు వస్తున్నాయి.

స్థిరమైన ప్రణాళిక ఏదీ?

ముందస్తు ప్రణాళిక లేకుండా తరచూ విధానాలు మారుస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రీకృత వ్యవస్థను తీసుకువచ్చి, మళ్లీ ఎందుకు రద్దు చేశారో కూడా ఫ్యాకల్టీకి అంతుచిక్కడం లేదు. సాధారణంగా విధానాల్లో మార్పులు సహజమే అయినప్పటికీ, తరచూ మారుతున్న నిర్ణయాల కంటే స్థిరమైన అకడమిక్‌ విధానం అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ట్రిపుల్‌ఐటీలు ఏర్పాటయ్యాయి. ఈ ఆశయం నెరవేరాలంటే అధికారులు ఇకనైనా అస్థిర నిర్ణయాలకు ముగింపు పలికి, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా స్థిరమైన విద్యావిధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది.

అస్థిర నిర్ణయాలతో గందరగోళం

ప్రణాళికా లోపంతో అకడమిక్‌ క్యాలెండర్‌పై ప్రభావం

ట్రిపుల్‌ఐటీల్లో రద్దయిన ‘ఉమ్మడి పరీక్షల’ విధానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement