చింతలపూడి (జంగారెడ్డిగూడెం): పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వచ్చేనెల 5న దేవరపల్లిలో ‘పొగాకు మహోద్యమం’ సభను నిర్వహించనున్నారని, పార్టీ శ్రేణులు జయప్రదం చే యాలని పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు పిలుపునిచ్చారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలో పార్టీ నేత జెట్టి గురునాథరావు కార్యాలయం వద్ద పార్టీ ముఖ్య నాయకులు, యువజన విభాగం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరాజు మా ట్లాడుతూ మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా, జంగారెడ్డిగూడెంలో గతంలో రైతులు చేసిన ఉద్యమాన్ని ఆయన కొనియాడారని గుర్తుచేశారు. ప్రతి పొగాకు బేలూ కొనుగోలు చేసేంత వరకూ రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. దేవరపల్లిలో జరిగే మహాసభకు పార్టీ నా యకులు, కార్యకర్తలు, యువతతో పాటు రైతులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్పూరం గౌరయ్యగుప్త, యువ నాయకుడు జెట్టి సత్య ఆదిత్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ అయినాల వెంకట రమణమూర్తి, నేకూరి కిషోర్, జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చిప్పాడ వెంకన్న, రాష్ట్ర నాయకుడు భావన ఋషి, నాయకులు కాసర శేషారెడ్డి, కత్తి వసంత్, డాక్టర్ పళ్ల రమణ, గగ్గల కిరణ్ కుమార్, కాటం అనిల్ తదితరులు పాల్గొన్నారు.


