ఉత్సాహంగా రాష్ట్రస్థాయి రోయింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి రోయింగ్‌ పోటీలు

Jul 27 2026 12:54 AM | Updated on Jul 27 2026 12:54 AM

చింతలపూడి (జంగారెడ్డిగూడెం): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ వాటర్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌లో రాష్ట్రస్థాయి రోయింగ్‌ చాంపియన్‌షిష్‌–2026 పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఎస్‌ఆర్‌ఏఏపీ, శాప్‌, డీఎస్‌ఏ ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. శాప్‌ డైరెక్టర్‌ జగదీశ్వరి, శాప్‌ డీఎస్‌డీఓ అజీజ్‌ సిరాజ్‌, ఎస్‌ఆర్‌ఏఏపీ అ ధ్యక్షుడు తరుణ్‌ కాకాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలురు, బాలికలకు సబ్‌ జూనియర్‌, జూ నియర్‌, సీనియర్‌ విభాగాల్లో సింగిల్‌, డబుల్‌ స్కల్స్‌ అంశాలపై ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రధాన కోచ్‌ కృష్ణమూర్తి, టెక్నికల్‌ అఫీషియల్‌ విజయ్‌ రో వర్‌ పర్యవేక్షించారు. జిల్లాల ప్రతినిధులు ఉదర్ల జోషి (ఏలూరు), ఎన్‌.పవన్‌ (ఎన్టీఆర్‌), ఎం.తులసిరామ్‌ (అనకాపల్లి), పరిగి వేణుగోపాలరావు (సత్యసాయి), పి.శ్రీనివాస్‌ (శ్రీకాకుళం), వెంకటేష్‌ (పశ్చిమగోదావరి), ఎన్‌.దేవుడు (తూర్పుగోదావరి), సర్పంచ్‌ సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు చంటి పాల్గొన్నారు.

విజేతలు వీరే..

సబ్‌ జూనియర్‌ బాలికల విభాగం : ఎం.లక్ష్మి (ఏలూరు) స్వర్ణం, జె.హైడి రోసిలిన్‌ (పశ్చిమగోదావరి) రజతం, ఎం.జాగృతి (నెల్లూరు) కాంస్యం.

సబ్‌ జూనియర్‌ బాలుర విభాగం : ఎం.కుశాల్‌ (నెల్లూరు) స్వర్ణం, ఎన్‌.జస్వంత్‌ (ఏలూరు) రజతం, బి.నిర్మలా నాయక్‌ (పశ్చిమగోదావరి) కాంస్యం.

జూనియర్‌ మహిళల విభాగం : కె.ప్రేమకుమారి (ఏలూరు) స్వర్ణం, జె.వాసవి (అనకాపల్లి) రజతం, ఎస్‌.యమున (ఎన్టీఆర్‌ జిల్లా) కాంస్యం.

జూనియర్‌ బాలుర విభాగం: జి.మాధవ్‌ (ఎన్టీఆర్‌ జిల్లా) స్వర్ణం, బి.లిఖిత్‌ నాయక్‌ (శ్రీకాకుళం) రజ తం, ఐ.జగదీష్‌ (ఎన్టీఆర్‌ జిల్లా) కాంస్యం.

సీనియర్‌ పురుషుల విభాగ ం: జి.సాయిరామ్‌ (ఎన్టీఆర్‌ జిల్లా) స్వర్ణం, బి.సంతోష్‌ (ఏలూరు) రజతం, ఎన్‌.దేవరాజ్‌ (అనకాపల్లి) కాంస్య పతకాలు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement