వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో మా రైతులకు యూరియా అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వం పాత పద్ధతిలో కాకుండా కొత్తగా మొబైల్ యాప్ విధానంలో యూరియా బుకింగ్ కోరుతుండడంతో మా ప్రాంతంలో సిగ్నల్ లేక బుకింగ్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఇకనైనా ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతం వరకు పాత పద్ధతిలోనే యూరియా అందించేలా చర్యలు చేపట్టాలి.
– కారం నరేంద్ర, ఇసుకపాడు గ్రామం, కుక్కునూరు మండలం.
ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మంది గిరిజన రైతులకు మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసే విధానం గురించి సరైన అవగాహన లేదు. దీంతో యూరియా బుకింగ్ చేయడం కష్టంగా మారుతోంది. అందుకే ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పాత పద్ధతిలోనే యూరియాను అందించేలా చర్యలు తీసుకోవాలి.
– సోడే నాగేశ్వరరావు, కమ్మరిగూడెం, కుక్కునూరు మండలం


