న్యూస్‌రీల్
చిర్రి అరాచకాలను అడ్డుకోవాలి
లీక్ చేశారనే ఆరోపణలతో..
శురకవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం జనసేన ఎమ్మె ల్యే చిర్రి బాలరాజు కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రెస్‌గా మారారు. పనుల్లో పర్సంటేజీలు, నామినేట్ పదవులకు ఫిక్సెడ్ రేట్లు, మద్యం దందా వీటన్నింటితో పాటు వరుస వివాదాలతో హాట్‌టాఫిక్‌గా మారా రు. తాజాగా అవినీతి ఆరోపణలపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే భార్యను పవన్‌కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్లేందుకు ముఖ్య అనుచరుడే సహకరించాడని, అతడిని టార్గెట్ చేయడం గురువారం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ క్లాస్ పీకినా వైఖరిలో మార్పు లేకపోగా కాంట్రవర్సీ స్పీడ్ మరింత పెంచడంతో సమస్య మరింత తీవ్రమైంది.
పోలవరం నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా చిర్రి బాలరాజు తొలిసారిగా గెలుపొందారు. నాటి నుంచి వరుస వివాదాలు, సోషల్ మీడియా వేదికగా నిత్యం అసమ్మతి సెగలు వెంటాడుతూనే ఉన్నాయి. పార్టీలో కష్టపడి పనిచేస్తే పట్టించుకోకుండా అన్యాయం చేశారని, అలాగే ఇసుక దందా చేస్తూ తమ కడుపుకొడుతున్నారని, గ్రావెల్ దందా పెద్ద ఎత్తున చేస్తున్నారని ఎమ్మెల్యే అయిన రెండు నెలల నుంచే ఫిర్యాదుల పరంపర నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఇక ఈ ఏడాది ఎమ్మెల్యే అట్టహాసంగా పుట్టినరోజు చేసుకోవడం, నియోజకవర్గంలో ముఖ్య అధికారి మొదలు గ్రామస్థాయి ప్రభుత్వ ఉద్యోగి వరకు అందరి దగ్గర రూ.లక్షల్లో వసూలు చేసి వేడుక నిర్వహించడం మరింత వివాదంగా మారింది. ఈ వ్యవహారాలు ఇలా కొనసాగుతుంటే ఎమ్మెల్యే కుటుంబంలోనూ విబేధాలు పొడచూపాయి. వేరే మహిళతో సన్నిహితంగా ఉంటూ తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఎమ్మెల్యే సతీమణి నియోజకవర్గంలో ముఖ్యనేత కరాటం రాంబాబు మొదలు అందరి వద్ద వాపోయినా ప్రయోజనం చేకూరలేదు. ఈ క్రమంలో మూడుసార్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను కలవడానికి ప్రయత్నించి విఫలమైన ఆమె గత నెలలో కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసి కుటుంబంలో నెలకొన్న పరిస్థితిని వివరించి న్యాయం చేయమని ప్రాధేయపడింది. తదనంతరం దీనికి కొనసాగింపుగా ఎమ్మెల్యే గడిచిన రెండేళ్లల్లో భారీగా అవినీతి పాల్పడ్డారని ఏఏ పోస్టులకు ఎంతెంత వసూలు చేశారనే సమగ్ర వివరాలు బాధితుల ఫోన్ నంబర్లతో ఏడు పేజీల ఫిర్యాదును పార్టీకి అందజేశారు.
ప్రధానంగా ఏఎంసీ చైర్మన్ పదవికి రూ. 31 లక్షలు, వైస్ చైర్మన్ పదవికి రూ.15 లక్షలు, పీఏసీఎస్ చైర్మన్ పదవికి ఒకరి వద్ద రూ.10 లక్షలు, మరొకరి వద్ద రూ.12 లక్షలు, ఇంకొకరి దగ్గర రూ.7 లక్షలు , అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోసం రూ. లక్ష, గూటాల–2 ఇసుక ర్యాంపునకు రూ.25 లక్ష లు, అండర్–16 క్రికెట్ టీమ్ కోసం రూ.5 లక్షలు వసూలు చేశారని బాధితుల ఫోన్ నంబర్లతో సహా చేసిన ఫిర్యాదులు సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చారు. ఈ క్రమంలో గత నెలలో పవన్‌కళ్యాణ్ ఎమ్మెల్యేను పిలిపించి నాలుగు వారాల్లోపు అన్నీ పరిష్కరించుకోవాలని గట్టిగా క్లాస్ పీకారు. కుటుంబ వ్యవహారాన్ని కూడా చక్కదిద్దుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ పోలవరం నియోజకవర్గ అధ్యక్షుడు సున్నం సురేష్ ఆరోపించారు. ఆయన దగ్గర పనిచేస్తున్న వంశీపై దాడి చేసి జీలుగుమిల్లి పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసు పెట్టారని ఇది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఎమ్మెల్యే రెండో వివాహం చేసుకున్న విషయమై ఆయన మొ దటి భార్య డిప్యూటీ సీఎంను కలిసి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కారుకు వంశీ డ్రైవర్ అని, అందుకే కక్షపూరితంగా వ్యవహరించి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
కాంట్రవర్సీ ఎమ్మెల్యే
వివాదాలకు కేరాఫ్ చిర్రి బాలరాజు
సమాచారాన్ని లీక్ చేస్తున్నాడని ముఖ్య అనుచరుడిపై దౌర్జన్యం
ఇదేంటని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేపై దాడికి యత్నించాడని రివర్స్‌లో హడావుడి
లెక్కకు మించిన అవినీతి ఆరోపణలతో ఎమ్మెల్యే సతమతం
ఎమ్మెల్యే తీరుపై పవన్‌కల్యాణ్‌కు సతీమణి ఫిర్యాదు
ప్రతి పదవికీ పేమెంట్ వసూలు చేశారనే ఆరోపణలు
బంధువు, ముఖ్య అనుచరుడు పూనం వంశీ తన సమాచారాన్ని మొత్తం బయటకు చేరవేస్తున్నాడని, తన భార్యను పవన్‌కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్లాడనే అనుమానంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దూరం పెట్టారు. ఇదేమిటని వంశీ ప్రశ్నించిన క్రమంలో అతడిని కార్యాలయం నుంచి గెంటివేయించి జీలుగుమిల్లి పోలీసులకు అప్పగించారు. అంతకుముందు వంశీ సోదరి నాగేశ్వరి కూడా ఎమ్మెల్యేను ఇదేంటని ప్రశ్నిస్తే ఆమెను కూడా అనుచరులతో బయటకు పంపివేయించారు. గురువారం ఉదయం నుంచి జీలుగుమిల్లి పోలీసుల అదుపులో వంశీ ఉన్నాడు. వంశీ భార్య మౌనిక విషయం తెలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ప్రశ్నిస్తే ఎస్సై తనకేమీ తెలియదని చెప్పడంతో.. తన భర్తను చూపించకపోతే చనిపోతానని ఆమె హెచ్చరించింది. ఏ తప్పు చేయని తన భర్త వంశీ, శంకర్‌బాషాను ఎమ్మెల్యేనే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది.


