బీసీ కమిషన్‌కు వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

బీసీ కమిషన్‌కు వినతుల వెల్లువ

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

బీసీ కమిషన్‌కు వినతుల వెల్లువ

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏకసభ్య డెడికేటెడ్‌ కమిషన్‌ గురువారం జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలోని కమిషన్‌ సభ్యులు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వితో కలిసి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి కచ్చిత సమాచారం సేకరించాలని చైర్మన్‌ సూచించారు. ముందుగా ఆయన జిల్లా బీసీ సంక్షేమ వర్గాల నా యకులు, ప్రతినిధుల నుంచి అర్జీలు స్వీకరించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, రాష్ట్ర వడ్డీల సంఘ చైర్‌పర్సన్‌ ఘంటసాల వెంకటలక్ష్మి తదితరుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లాలో ఏకీకృత కుటుంబ సర్వే 97.32 శాతం పూర్తిచేశామని, మరింత స్పష్టత కోసం కొన్ని కుటుంబాల వివరాలను రీ సర్వే చేస్తున్నామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి చె ప్పారు. కమిషన్‌ కార్యదర్శి చంద్రశేఖరరాజు, ఇన్‌చార్జి డీఆర్వో దేవకీదేవి, జెడ్పీ సీఈఓ జగదాంబ, డీ పీఓ మల్లికార్జునరావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం. ముక్కంటి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ విశ్వమోహన్‌రెడ్డి, కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌ పాల్గొన్నారు.

వినతుల్లో కొన్ని..

● జనాభా దామాషా ప్రకారం బీసీలకు కూడా 50 రిజర్వేషన్‌ అన్ని రంగాల్లో కల్పించాలని ఏపీ బీసీ కులాల జేఏసీ ప్రతినిధులు కోరారు.

● బీసీ గ్రూపులోని గౌడ కులానికి స్థానిక సంస్థల్లో సబ్‌ కొత్తగా కల్పించాలని, లేదా బీసీ–బీ లోపల జనాభా ప్రాతిపదికన రొటేషన్‌ స్పష్టంగా అమలు చేయాలని ఏలూరు నగర గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు.

● ట్రిపుల్‌ టెస్ట్‌ ప్రక్రియ కేవలం విధాన పరమైన ప్రక్రియగా కాకుండా, బీసీల సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతను బలోపేతం చేసేదిగా ఉండాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మశ్రీ అభిప్రాయపడ్డారు.

● పోటీ చేయడానికి అవకాశం లేని చోట మండలపరిషత్‌, జెడ్పీ, మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్‌ సభ్యులుగా విశ్వ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని, విశ్వబ్రాహ్మణులను బీసీ–బీ నుంచి బీసీ–ఏకి మార్చాలని విశ్వబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కోరారు.

● విద్యా, ఉద్యోగ రంగాల్లో మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ వర్గీకరణ బీసీ–ఏ నుంచి బీసీ–ఈ వరకు అమలు చేయాలని ఏపీ నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్‌, డెవలప్‌మెంట్‌ కా ర్పొరేషన్‌ డైరెక్టర్‌ లంకా రత్నారావు కోరారు.

● జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేష న్లు, బీ సీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధుల కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement