ఆలస్యంగా కార్యక్రమం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గుర య్యారు. అధికారుల అలసత్వమే కారణమని పలువురు ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి ఆలయ ఆవరణలోని నూతన అనివెట్టి మండపంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ ఆలస్యంగా రావడంతో 9 గంటలకు ప్రారంభమైంది. గంట పాటు కా ర్యక్రమం కొనసాగింది. దీంతో యోగా అ భ్యాసకులు అప్పటివరకు అల్పాహారం తినకుండా వేచి ఉండాల్సి వచ్చింది. పిల్లలు, షు గర్, బీపీ తదితర వ్యాధులతో బాధపడుతున్న పలువురు అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఏ ర్పాటు చేసిన కార్యక్రమాలకు అధికారులే సకాలంలో హాజరుకాకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు అ సెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దొంగ వెంకట రామాంజనేయులకు పార్టీ రాష్ట్ర న్యాయ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏలూరు టౌన్: విద్యుదాఘాతానికి గురై నవ వధువు దుర్మరణం పా లైన ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు శాంతినగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మీ ఉష (21)కు వెంకటేష్‌తో గతనెల 8న వివాహమైంది. ఆమె సత్రంపాడు రోడ్డులో భర్తతో కలిసి కూల్‌డ్రింక్స్ షాపు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఆమె షాపులో ఉండగా భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో ఆమె విద్యుత్ షాక్‌తో తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానికులు ఆమెను సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్లగా వై ద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతిచెందిన ట్టు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా మృతురాలి ఉషది ప్రేమ వివాహం.


