ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో నూతన అనివెట్టి మండపం పక్కన నిర్మించిన క్యూలైన్లలోని పైకప్పు ఈదురుగాలులకు ధ్వంసమైంది. మరమ్మతులు చేపట్టారు.
మొత్తంగా 2 కిలోల 50 గ్రాముల గోల్‌మాల్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో గోల్డ్ మాయం సంఘటనకు సంబంధించి ఐదో రోజు కూడా బంగారం పరిశీలన జరిగింది. ఉదయం నుంచే ఖాతాదారులు బ్యాంకుల వద్దకు చేరుకుని తమ బంగారు ఆభరణాల కోసం ఎదురుచూశారు. బ్యాంకు అధికారులు గురువారం బంగారు రు ణాలకు సంబంధించి బంగారం ఉంచిన ప్యాకెట్లను పరిశీలించగా, వాటిలో 14 ప్యాకెట్లకు సంబంధించి 324 గ్రాములు బంగారం లెక్కల్లో తేడా కనిపించింది. గత నాలుగు రోజులుగా చే పట్టిన బంగారం తనిఖీల్లో 1,726 గ్రాముల బంగారం మాయం కాగా, తాజాగా మరో 324 గ్రా ముల బంగారం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో మొత్తం 2 కిలోల 50 గ్రాముల బంగారం మాయమైంది. ఇదిలా ఉండగా పరిశీలనలో ఆయా బంగారం ప్యాకెట్లలో రోల్డ్‌గోల్డ్, ఇత్తడి, చాక్‌పీసులు, స్టాప్లర్ పిన్‌ల బాక్సులు వంటివి బంగారానికి బదులుగా ఉంచినట్టు గుర్తించారు. దీంతో ఖాతాదారులతో పాటు ప్రజలు సైతం బ్యాంకు తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అప్రయిజర్, బ్యాంకు సిబ్బంది పాత్ర లేకుండా ఇటువంటి గోల్‌మాల్ జరగదని, వెంటనే ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించడంతో పాటు ఖాతాదారుల బంగారం వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.


