తణుకు అర్బన్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు అరెస్టు చేశారు. గతేడాది అక్టోబర్‌లో తణుకు ఉండ్రాజవరం రోడ్డులో శ్శశాన వాటిక ప్రాంతంలో ఐదు కిలోల గంజా యి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడు తణుకు మండలం మండపాకకి చెందిన పోలవరపు కుమార శివను బుధవారం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఒడిసాలోని మల్కాన్‌గిరి నుంచి గంజాయిని తీసుకువచ్చి తణుకు ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. ఇటీవల ద్విచక్ర వాహనాల చోరీలకు అలవాటుపడి కృష్ణలంక, రాజమండ్రి, ఉంగుటూరు, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేశాడని చెప్పారు. గంజాయి విక్రయాలపై సమాచారం తెలిస్తే 9490874538 తమకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఎకై ్సజ్ శాఖ ఎస్సైలు బి.లక్ష్మి, ఆర్.మధుబాబు పాల్గొన్నారు.


