బలుసులమ్మకు ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

బలుసులమ్మకు ప్రత్యేక పూజలు

Mar 14 2026 7:51 AM | Updated on Mar 14 2026 7:51 AM

బలుసులమ్మకు ప్రత్యేక పూజలు యువత ఆరోగ్య జీవన శైలితో ఉండాలి

తాడేపల్లిగూడెం (టీఓసీ): బలుసులమ్మ మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాల సందర్భంగా శుక్రవారం అమ్మవారికి పసుపు కొమ్ములతో అర్చన చేశారు. అనంతరం అష్టలక్ష్మి ఆరాధన పూర్వక సామూహిక సౌభాగ్య కుంకుమ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వందలాదిగా మహిళలు ఈ పూజలలో పాల్గొన్నారు. సాయంత్రం మూలమంత్ర హోమాలు, లక్ష్మీహోమం, రుద్ర హోమాలు, పల్లకి ఉత్సవం ఘనంగా చేశారు. ఏర్పాట్లను శ్రీరంగం అంజి పర్యవేక్షించారు.

తాడేపల్లిగూడెం: యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని శాప్‌ చైర్మన్‌ ఎ.రవినాయుడు పిలుపునిచ్చారు. వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం 12వ అంతర్‌ కళాశాల క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమ శిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయన్నారు. ఉద్యానవర్సిటీ వీసీ డాక్టర్‌ కె.ధనుంజయరావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో క్రీడలకు సముచిత స్థానం ఇవ్వాలన్నారు. ఈ పోటీల్లో ఉద్యాన విశ్వ విద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఎనిమిది కళాశాలల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్‌ సహా 25కు పైగా ట్రాక్‌ , ఫీల్డ్‌ ఈవెంట్లు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ముందుగా విద్యార్థులు ఫ్లాగ్‌ మార్చ్‌ చేశారు. కార్యక్రమంలో డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ సి.మధుమతి, డీన్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ డాక్టర్‌ ప్రసన్నకుమార్‌, ఎస్‌.సూర్యకుమారి, విజయపద్మ, రామానందం, రిజిస్ట్రార్‌ మాధవి, సి.రూత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement