డీఎస్పీ శ్రావణ్‌కుమార్
కై కలూరు: చిన్నపిల్లల విక్రయ ఆరోపణల నేపథ్యంలో కై కలూరు పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, జిల్లా చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ డాక్టర్ సూర్యచక్రవేణి, రూరల్ సీఐ వి.రవికుమార్ శుక్రవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ముదినేపల్లి మండలంలో మెక్షిత్ అనే బాబు రెండు నెలలుగా కనిపించడం లేదన్నారు. మండవల్లి మండలం కానుకొల్లు గ్రామంలో ఒకరు కనిపించడం లేదని తెలిసిందన్నారు. ఐసీడీఎస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. నియోజకవర్గంలో 13, 5, 4 సంవత్సరాలతో పాటు ఈ ఏడాది పిల్లలు లేని కుటుంబాలకు కొందరు పిల్లలను ఇచ్చారన్నారు. ఇది బంధువుల మధ్య జరిగిందన్నారు. చట్ట ప్రకారం పిల్లలను దత్తత తీసుకోవాలని డీఎస్పీ చెప్పారు. హిందూ దత్తత యాక్టు, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్టుతో పాటు ఐపీసీ ప్రకారం నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఐసీడీఎస్ ద్వారా ఇటీవల పిల్లలు పెంచుకుంటున్న వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. అనుమానితులను ఇప్పటికే గుర్తించామని కేసు నమోదు చేసి విచారిస్తామన్నారు. ప్రధానంగా నగదు లావాదేవీలు ఏమైనా జరిగాయా? అనే కోణంలో ధర్యాప్తు చేస్తామన్నారు. బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. జిల్లా చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ డాక్టర్ సూర్యచక్రవేణి మాట్లాడుతూ అంగన్‌వాడీల పరిధిలో గర్భం దాల్చి పిల్లలు లేకుండా పెంచుకుంటున్న వారి వివరాలు సేకరించామన్నారు.


