ఏలూరు (టూటౌన్): అమెరికా ప్రయోజనాలకు లొంగిపోతూ దూరదృష్టి లేకుండా ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభాకర్ మాట్లాడుతూ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నెలకొందన్నారు. గ్యాస్ కొరతతో హోటళ్లు, వీధుల్లో అంగళ్లు పెట్టుకొని జీవనోపాధి పొందే అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రాష్ట్రంలో గృహ వినియోగం 80 శాతం వరకు ఉండగా వాణిజ్యపరంగా 15 శాతం, ఇతర అవసరాలకు ఐదు శాతం ఉందన్నారు. అయినా గృహ వినియోగదారులకు సిలిండర్ కోసం బుక్ చేసిన 25 రోజులకు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదన్నారు. జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, కార్యవర్గ సభ్యుడు కొల్లూరు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం జరిగే జాతీయ లోక్‌అదాలత్‌లో ఎ క్కువ కేసులు పరిష్కారం అయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి కోరారు. శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో తొలి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, రాజీయోగ్యమైన కేసులను రాజీ చేస్తామన్నారు. గత డిసెంబర్‌లో జరిగిన లోక్ అదాలత్‌లో 10,798 కేసులను రాజీ చేశా మని చెప్పారు. ఈ లోక్ అదాలత్‌లో 9,345 కేసులు రాజీయోగ్యమైనవి గుర్తించామన్నారు. కక్షిదారులు సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామని, కేసుల పరిష్కారంలో సందేహాలు ఉంటే 08812 2245 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఏలూరు బార్ అసోసియేషన్ ప్రె సిడెంట్ కోనే సీతారాం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్–డి 2026 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని, ఈ మేరకు అభ్యర్తుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఏలూరు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమధికారి ఆర్‌వీ నాగరాణి, శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 20లోపు దరఖాస్తులు సమర్పించాలని, 100 మంది అభ్యర్థులకు రెండు నెలలపాటు ఉచిత శిక్షణతో పాటు స్టయిఫండ్, స్టడీ మెటీరియల్ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8686180018, 9030211920 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఏలూరు (టూటౌన్): జిల్లాలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ కొరత లేదని జేసీ ఎంజే అభిషేక్ గౌడ తెలిపారు. గ్యాస్ కొరతపై ని రాధారమైన వదంతులను నమ్మవద్దని కోరా రు. జిల్లాలో సిలిండర్ల నిరంతర సరఫరాను ని ర్ధారించడానికి పటిష్ట చర్యలు చేపట్టామన్నా రు. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశామన్నారు. గ్యాస్ సరఫరాలో సమస్యలు ఎ దురైనా, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. అసిస్టెంట్ సప్లయ్ ఆఫీసర్ (ఏఎస్‌ఓ) ఏలూరు– 8919887013, ఎం.సంధ్యాకుమారి (జూనియర్ అసిస్టెంట్,డీసీఎస్‌ఓ కార్యాలయం) –9652892425, పి.నాగదుర్గ (సీనియర్ అసిస్టెంట్, డీసీఎస్‌ఓ కార్యాలయం)– 79812 22542 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
ముసునూరు: అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం రైతులకు వరం అని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని మండలంలోని చెక్కపల్లిలో శుక్రవారం రాత్రి నిర్వహించారు. నూజివీడు నియోజక వర్గంలో 35,529 మంది రైతులకు రూ.19.77 కోట్లు, ముసునూరు మండలంలోని 8,205 మంది రైతులకు రూ.4.64 కోట్ల విలువైన నమూనా చెక్కులను అందజేశారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తదితరులు పాల్గొన్నారు.


