ద్వారకాతిరుమల: వంట గ్యాస్‌కు కొరత ఏర్పడటంతో చిన వెంకన్న క్షేత్రంలో కట్టెల పొయ్యిలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం రెండు బ్లోయర్ ఇనుప కట్టెల పొయ్యిలను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. నిత్యాన్నదాన భవనం వద్ద ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, ఏఈఓ వాసు, డీఈ టి.సూర్యనారాయణ సమక్షంలో ట్రయిల్‌రన్ వేశారు. కట్టెలను మండించడానికి ఎలక్ట్రికల్ మోటర్‌తో ఉన్న బ్లోయర్‌ను అమర్చారు. పొయ్యిల పనితీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిగా గ్యాస్ సరఫరా నిలిచిపోయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో, నిత్యాన్నదాన భవనంలో వంటలను వండేందుకు వీటిని వినియోగించనున్నారు. మరికొన్ని పొయ్యిలను కొనుగోలు చే యాలని అధికారులు నిర్ణయించారు.


