సర్పంచ్‌గా తిరిగి విధుల్లోకి.. | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌గా తిరిగి విధుల్లోకి..

Mar 14 2026 7:50 AM | Updated on Mar 14 2026 7:50 AM

సర్పంచ్‌గా తిరిగి విధుల్లోకి.. 11,841 మంది విద్యార్థులు హాజరు

కై కలూరు: కై కలూరు పంచాయతీ సర్పంచ్‌ గా తిరిగి దానం మేరీ నవరత్నకుమారి విధుల్లో శుక్రవారం చేరారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఎస్పీ రిజర్వేషన్‌లో సర్పంచ్‌గా ఎ న్నికై న రత్నకుమారిని నిధుల దుర్వినియో గం అంశంపై గతేడాది జూన్‌ 19న కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సస్పెండ్‌ చేశారు. అంతకు ముందు 2025 జనవరి 18న చెక్‌పవర్‌ను రద్దు చేశారు. దీంతో ఆమె న్యాయపోరాటం చేసింది. ప్రముఖ న్యాయ వాది జడ శ్రావణ్‌కుమార్‌ సర్పంచ్‌ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించారు. గతనెలలో తిరిగి విధుల్లో చేరాలని పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె విధుల్లో చేరే ముందు కై కలూరు తాలూకా సెంటర్‌లో దళిత నాయకులతో కలిసి అంబేడ్కర్‌ వి గ్రహానికి నివాళి అర్పించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లావ్యాప్తంగా శుక్రవారం 54 కేంద్రాల్లో జరిగిన ఇంటర్‌ ఫిజిక్స్‌–2 పరీక్షలకు 11,841 మంది విద్యార్థులు హాజరయ్యారు. 12,037 మందికి 196 మంది గైర్హాజరయ్యారు.

ముగిసిన దూరవిద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయని డీఈఓ వెంకటలక్ష్మమ్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement