రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
జంగారెడ్డిగూడెం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ప్రభుత్వం రానుందని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణ, మండల వైఎస్సార్‌సీపీ ఆత్మీయ విస్తృత స్థాయి సమావేశం చింతలపూడి కన్వీనర్ కంభం విజయరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు నిర్మాణాత్మక శక్తిగా ఎదగాలన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి జగన్‌ను సీఎం చేయాలన్నారు. సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి అన్ని విభాగాల కమిటీలు ఏర్పాటు చేసుకుని ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. ఇందుకోసం జగన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారన్నారు.
ఎమ్మెల్సీ, ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు వంకా రవీంద్రనాధ్ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని సూచించారు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను వివరించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు తమకు ఇచ్చిన పదవులకు న్యాయం చేయాలని, స్థానిక నాయకత్వం బలంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో విజయానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ అక్రమ కేసులు పెడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు ప్రభుత్వం ఏలుతుందన్నారు. లక్షల కోట్ల ఆస్తులను చంద్రబాబు తమ అనునాయులకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. కోటి సంతకాల ఉద్యమం ఒక అద్భుత ఘట్టమని పేర్కొన్నారు. జగనన్న కార్యకర్తలకు ప్రముఖస్థానం కల్పిస్తున్నారని, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి జగనన్నను తిరిగి సీఎం చేసుకోవాలన్నారు.
కార్యకర్తలకు అగ్రస్థానం: జెట్టి గురనాథరావు
రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పరిశీలకుడు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. కార్యకర్తలకు జగనన్న అగ్రస్థానం కల్పిస్తున్నారని, సంస్థాగత ఎన్నికలు పూర్తిచేసి పార్టీ సైన్యాన్ని సిద్దం చేయాలన్నారు. ఇప్పటికే చాలా కమిటీలు వేసి పూర్తి చేశామన్నారు. జగనన్నే మన నాయకుడని పేర్కొన్నారు. 2029లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బత్తిన లక్ష్మి, ఉభయగోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపేయి సుధీర్, సీఈసీ సభ్యులు దయ్యాల నవీన్‌బాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి తదితరులు మాట్లాడారు. కౌన్సిలర్ మానవత మూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం గుప్త, వైస్ ఛైర్మన్ ముప్పిడి అంజి, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, గురజాల పార్థసారధి, మేడవరపు విద్యాసాగర్, కనికళ్ల ప్రసాద్, సాయిల స్వాతి, వామిశెట్టి హరిబాబు, భావన రుషి, బత్తిన చిన్న, శ్యామ్, బోను రాధిక, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


