14 నుంచి సంక్రాంతి సంబరాలు | - | Sakshi
Sakshi News home page

14 నుంచి సంక్రాంతి సంబరాలు

Jan 10 2026 8:19 AM | Updated on Jan 10 2026 8:19 AM

14 నుంచి సంక్రాంతి సంబరాలు

14 నుంచి సంక్రాంతి సంబరాలు

భోగి మంటల్లో తగులబెట్టండి 14 నుంచి సంక్రాంతి సంబరాలు

భోగి మంటల్లో తగులబెట్టండి
వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఉత్తర్వుల కాపీలను, వికసిత్‌ భారత్‌ జీ రాం జి కాపీలను భోగి మంటలలో తగులబెట్టాలని సీపీఐ నేతలు పిలుపునిచ్చారు. IIలో u

15న నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు

16న చినవెంకన్నకు కనుమ ఉత్సవం

ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో ఈనెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వై.భద్రాజి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భోగి పండుగను పురస్కరించుకుని 14న ఆలయ తూర్పు రాజగోపురం వైపున ఉన్న ఖాళీ ప్రదేశంలో కోలాట నృత్యాలు, హరిదాసులు, బుడబుక్కల వేషధారణలతో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతామన్నారు. 15న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. 16న కనుమ పండుగ సందర్భంగా దొరసానిపాడులో శ్రీవారికి కనుమ ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారు ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ దొరసానిపాడుకు బయల్దేరి వెళతారని, అక్కడ కనుమ మండపంలో అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణలతో ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement