యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
బుట్టాయగూడెం: మండలంలోని రెడ్డిగణపవరం, దొరమామిడి గ్రామంలో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సుమారు 10 ట్రాక్టర్‌లతో జేసీబీల ద్వారా మట్టి గుట్టలను తొలగించి ఇళ్లకు, ఇటుకల బట్టీలకు తరలిస్తున్నారు. అయితే అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందినా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో అక్రమ మట్టి తవ్వకాలతో, ట్రాక్టర్‌ల శబ్దాలతో చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకుని తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


