బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Jan 10 2026 8:19 AM | Updated on Jan 10 2026 8:19 AM

బాధ్య

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ డ్రగ్స్‌ మాఫియాకు ప్రభుత్వ అండదండలు వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ నియామకాలు 11న ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రాక

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన ఉండి నియోజకవర్గానికి చెందిన జుత్తుగ నాగరాజు స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి సమస్యలున్నా పరిష్కరిస్తానని, పాఠకులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలను లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్‌ను గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్‌ బాబు నాగరాజు, డిప్యూటీ లైబ్రేరియన్‌ ఎ.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్‌ మత్తు మహమ్మారిలా విస్తరిస్తూ విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికుల జీవితాలను నాశనం చేస్తున్నా ప్రభుత్వం కావాలనే కళ్లు మూసుకుని కూర్చోందని పలువురు నాయకులు ఆరోపించారు. శుక్రవారం విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్‌ వ్యతిరేక రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏలూరు ఐద్వా మహిళా సంఘం కార్యాలయంలో నిర్వహించారు. మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాణి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ డ్రగ్స్‌ సరఫరా కేంద్రాలు బహిరంగంగానే పనిచేస్తున్నా, మత్తు పదార్థాల అమ్మకాలు కాలనీల్లో నిర్భయంగా సాగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం నిశ్చేష్టంగా వ్యవహరిస్తోందని వక్తలు మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె.లెనిన్‌, డీవైఎఫ్‌ఐ నాయకుడు ఎ.శరత్‌ చంద్ర, ఐద్వా నాయకురాలు పి.హైమావతి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం: వైఎస్సార్‌సీపీ స్టేట్‌ లీగల్‌ సెల్‌ సెక్రటరీగా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన మద్దు రామ్‌ప్రసాద్‌, జాయింట్‌ సెక్రటరీగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడేనికి చెందిన షేక్‌ రఫీ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ప్రసాద్‌ను నియమించినట్లు పార్టీ కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు వచ్చాయి.

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్ర షెడ్యూల్‌ తెగల కమిషన్‌ చైర్మన్‌ సోల్లా బొజ్జిరెడ్డి ఈ నెల 11న ఏలూరులోని రెవెన్యూ అతిథి గృహం చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు ఏలూరులోని గిరిజన భవన్‌ చేరుకుని, ఎస్టీ కమిషన్‌ సభ్యులతో కలిసి అసోసియేషన్‌ ప్రతినిధుల నుంచి సమస్యలు తెలుసుకుంటారు.

బాధ్యతల స్వీకరణ 1
1/4

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ 2
2/4

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ 3
3/4

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ 4
4/4

బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement