దేశ సేవలో అసువులు బాసి.. తీరని వేదన మిగిల్చి..
కాళ్ల: దేశ సేవలో తరించాలన్న ఆ యువకుడి ఆశ యం నెరవేరలేదు.. కొడుకుపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.. కుమారుడి మృతి వార్త తెలియగానే ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శిక్షణను దిగ్విజయంగా పూర్తిచేసుకుని విధుల్లో చేరిన తమ ఊరి బిడ్డ ఇక లేడని తెలిసి ఊరంతా కన్నీరు పెట్టింది.. ఢిల్లీలో జరిగిన రైలు ప్రమాదంలో కాళ్ల మండలం బొండాడపేటకు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బొర్రా సత్యనారాయణ (నాని) (26) మృతిచెందారు. సీఆర్పీఎఫ్ అధికారులు మృతదేహాన్ని గ్రా మానికి తీసుకువచ్చి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
బొండాడపేటలో విషాద ఛాయలు
బొండాడపేటకు చెందిన బొర్రా నాగరాజు, జయ దంపతుల రెండో కుమారుడు సత్యనారాయణ గతేడాది సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఢిల్లీ విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణతో పాటు ఆయన పనిచేసింది కేవలం 9 నెలలు మా త్రమే. కనీసం ఇల్లు కూడా సరిగాలేని నాగరాజు కూలీ పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించారు. మిలట్రీలో చేరాలన్న కొడుకు ఆశలు నెరవేర్చారు. ఇటీవల సెలవుపై వచ్చిన నాని త్వరలో ఇల్లు కట్టించి తల్లిదండ్రుకు ఏ కష్టం రానివ్వనని మాటిచ్చి వెళ్లారు. ఇంతలోనే డిసెంబర్ 31న ఢిల్లీలో మధుర వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నాని మృతిచెందినట్టు సమాచారం వచ్చింది.
ప్రత్యేక విమానంలో భౌతికకాయం
నాని భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం రాజమహేంద్రవరానికి పంపించా రు. అక్కడి నుంచి సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండర్ దినేష్‌కుమార్ శర్మ, ఎస్సై వెంకన్న, ఎనిమిది మంది సిబ్బందితో గ్రామానికి తీసుకొచ్చారు. మండలంలోని జక్కరం కాటన్ పార్కు వద్దకు చేరుకున్న గ్రా మస్తులు, యువత అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా భౌతికకాయాన్ని నాని ఇంటికి తీసుకువచ్చారు. స్థానిక పాఠశాల విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
నానికి సంబంధించి వస్తువులు, దుస్తులు అన్నీ జాతీయ జెండాలో మూటకట్టి కమాండర్ దినేష్‌కుమార్ శర్మ వాటిని తండ్రి నాగరాజుకు అప్పగించారు. దినేష్‌కుమార్ శర్మ ఆధ్వర్యంలో సర్పంచ్ మధుసూదనరావు, ఎస్సై శ్రీనివాసరావు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి సిబ్బంది నివాళులర్పించారు.
మిన్నంటిన రోదనలు
నాని మృతి వార్త తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రు లు, సోదరి రోదనలు మిన్నంటాయి. భౌతి కకాయం వద్ద వారు రోదించిన తీరు కన్నీరు పెట్టించింది. శివయ్యా.. నా కొడుకును ఎందుకు తీసుకున్నావ్ అంటూ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కుమారుడి మరణ వార్త తెలిసి విలపిస్తున్న తల్లి జయ
భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకువస్తున్న గ్రామస్తులు
ఢిల్లీలో రైలు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
కన్నీటి సంద్రమైన బొండాడపేట
భారీ ర్యాలీగా భౌతికకాయం తరలింపు
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
దేశ సేవలో అసువులు బాసి.. తీరని వేదన మిగిల్చి..
దేశ సేవలో అసువులు బాసి.. తీరని వేదన మిగిల్చి..
దేశ సేవలో అసువులు బాసి.. తీరని వేదన మిగిల్చి..


