గెస్ట్ ఫ్యాకల్టీ ఆందోళన
నూజివీడు ట్రిపుల్‌ఐటీలో తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గెస్ట్ ఫ్యాకల్టీలు చేపట్టిన ఆందోళన రెండో రోజు శుక్రవారంకొనసాగింది. IIలో u
బుట్టాయగూడెం: 40 ఏళ్లుగా తమ తాతల కాలం నుంచి సాగులో ఉన్న భూములపై కొందరు దళారులు కన్నేసి తమను బెదిరించి ఆర్‌అండ్‌ఆర్ భూసేకరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ జీలుగుమిల్లి మండలం తాటిరామన్నగూడెంకు చెందిన గిరిజనులు శుక్రవారం జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గిరిజనుడు కుంజా సోమరాజు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో సుమారు 80 ఎకరాల వరకు భూమిని గ్రామస్తులం సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు తమ భూములను ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. సాగులో ఉన్న భూములను ఆర్‌అండ్‌ఆర్‌లో విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు విచారణ చేసి తమ కు న్యాయం చేయాలని, తమను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామస్తులు గుజ్జు మంగరాజు, కుంజా లక్ష్మణరాజు, మడకం కళ్యాణి, పూసం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


