కొనసాగిన పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
జంగారెడ్డిగూడెం: ఏపీ మెడికల్ కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపులో భాగంగా 4వ రోజైన శుక్రవారం జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్, సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ గౌరవా ధ్యక్షుడు జంపన వెంకటరమణ రాజు, మండల కార్యదర్శి కుంచె వసంతరావు మాట్లాడుతూ కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, ప్రభుత్వానికి ఏజెన్సీల పేరిట దళారుల వ్యవస్థను కొనసాగించడం సహేతుకం కాదని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పారిశుద్ధ్య కార్మికుల ప్రధాన సమస్య అయిన కాంట్రాక్ట్ ఏజెన్సీను తొలగించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరంలో మావుళ్లమ్మవారి 62వ జాతర మహోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఉత్సవ ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి సా రించాలని, క్యూలైన్‌లో భక్తులు తాగునీరు, పా లు అందించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు, హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేయాలన్నారు.
పెంటపాడు: తణుకు నుంచి ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ ప్రత్తిపాడు జాతీయరహదారి సమీపంలో పంట బోదెలోకి దూసుకెళ్లింది. బస్సు 80 శాతానికిపైగా ఒరిగి బోల్తా కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉండగా అత్యవసర మార్గం మీదుగా స్థానికులు వారిని బయటకు తీసుకువచ్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్ కళ్లు తిరగడం వల్ల బస్సు అదుపు తప్పినట్టు చెబుతు న్నారు. సంఘటనా ప్రాంతాన్ని తాడేపల్లిగూడెం ఎంవీఐ నాయక్ పరిశీలించారు. తణుకు డిపోకు చెందిన సూపర్‌లగ్జరీ బస్సును ప్యాసింజర్ సర్వీసుగా నడుపుతున్నారు. ప్రమాదంలో ఎవరి కీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి బస్సును బోదె నుంచి బయటకు తీశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జంతువులను హింసించేలా ఏ ఒక్కరి చర్య ఉండకూడదు, సంక్రాంతి కోడిపందేలను నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా జంతు సంక్షేమ సంఘ సమావేశా న్ని నిర్వహించారు. కోడిపందేల నియంత్రణ, జంతు సంక్షేమం, మానవ జంతు సంబంధా లు, జంతు సంక్షేమ నియమాలు, జంతు సంక్షేమ చట్టాలు, జంతువుల రవాణా నియమా లు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భీమవరం అంటే కోడి పందేలు అనే ప్రచారం ఉందని, రాష్ట్ర నలుమూలల నుంచి పందేలు, పేకాట, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లకు వస్తారని వీటిని పూర్తిగా నిరోధించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జూద క్రీడల నిర్వాహకులు, కోళ్లకు కత్తులు కట్టేవారిపై నిఘా ఉంచాలన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): సచివాలయంలో అర్జీదారు దరఖాస్తు సమర్పణలో వీఆర్వో లే దా పంచాయతీ కార్యదర్శి సంతకం కావా లని డిజిటల్ అసిస్టెంట్లు ఎట్టి పరిస్థితుల్లో దర ఖాస్తులు తిరస్కరించకూడదని ఆదేశించినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టరేట్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, పాజిటివ్ పబ్లిక్ పెర్ఫా ర్మెన్స్ తదితర అంశాలపై సమీక్షించారు.
కొనసాగిన పారిశుద్ధ్య కార్మికుల ధర్నా


