
మాజీ మంత్రి వనిత కుటుంబంలో విషాదం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్ర వైఎస్సార్ సీపీ నాయకురాలు, మాజీ మంత్రి తానేటి వనిత మావయ్య తానేటి బాబూరావు (80) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం పాలకొల్లు తీసుకువచ్చారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన పెద్ద కుమారుడు డాక్టర్ టి.శ్రీనివాస్‌కు చెందిన తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బుధవారం పాలకొల్లులో అంతిమ కార్యక్రమాలు జరిపారు. ఈయనకు భార్య జ్యోతమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మాజీ మంత్రి తానేటి వనిత పెద్ద కోడలు. బాబూరావు మృతిపై వైఎస్సార్ సీపీ నాయకులు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాసు, యడ్ల తాతాజీ, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొని తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు.