● ప్రతి మొక్కలో ఆరోగ్య గుణాలు
● ఆయుర్వేద వైద్యంలో వినియోగం
● వాటితో స్వల్ప, దీర్ఘకాలిక వ్యాధులు నయం
ఇది పూర్తి ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఈ మొక్క విరిగిన కాళ్లకు, పుచ్చిపోయిన పళ్లకు, కాలి గాయాల నివారణకు ఉపయోగపడతాయి. ఇది అటవీ ప్రాంతంలో అందరికీ కనిపిస్తుంటుంది. కానీ ఇది ఒక ఔషధ మొక్క అని మనం గ్రహించలేం. ఆయుర్వేద వైద్యులు మాత్రం సమస్య వచ్చినప్పుడు ఆ మొక్కను చూపిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.
ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే లభించే పులివావిలి చెట్టులో ఆరోగ్య వైద్య గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కీళ్ల నొప్పులతో పాటు జ్వరం, శరీరంలో నొప్పులను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆకు దంచి వేడి చేసి నొప్పి ఉన్న చోట రుద్దడం, నీళ్లలో వేసి వేడిచేసి స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయి.
అడవుల్లో లభించే ప్రతి మొక్కలో ఔషధాలు ఉన్నాయి. నేను గత 22 ఏళ్లుగా గిరిజన ప్రాతంలో మూలికా వైద్యం చేస్తూ ఎంతో మందికి ఎన్నో జబ్బులను నయం చేశాను. సుగర్‌కు సంబంధించి 8 రకాల మొక్కలతో తయారు చేసిన ఔషధం ఎంతోమందికి ఉపయోగపడింది. ప్రతి మొక్క ఎంతో ప్రయోజనకరం.
– కుర్సం దుర్గారావు, మూలికా వైద్యుడు,
ఎర్రాయిగూడెం, బుట్టాయగూడెం మండలం
బుట్టాయగూడెం: ప్రకృతిలో లభించే వస్తువులకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అందంగా కనిపించే మొక్కలు, నోరూరించే పండ్లు, ఇంటికి వినియోగించే కలప ఇలా ఒకటేంటి అన్నీ మనకు ఉపయోగపడేవే. అడవిలో దర్శనమిచ్చే చెట్లు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సహజసిద్ధంగా లభిస్తున్న ఔషధ మొక్కలు, చెట్లు ఎన్నో ఆరోగ్య గుణాలను కలిగి ఉంటాయంటున్నారు. పూర్వం మన మహర్షులు మనుషుల్లో వ్యాధులను నివారించే మొక్కలు, వాటి ఔషధ గుణాలను వివరిస్తూ రుగ్వేదంలో పొందుపరిచారు. నేటి ఆధునిక కాలంలో ఎన్నో రకాల యాంటీబయాటిక్‌లు మందులు తయారవుతున్నప్పటికీ వాటికి నయం కాని రోగాలు ఆయుర్వేదం ద్వారా తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా లభించే ఆయుర్వేద మొక్కలు వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.
రక్తశుద్ధి, నులిపురుగుల నివారణకు ఉపయోగపడే సుగంధ వేరు తీగ
ఔషధ మొక్క పసుపు తంగేడు చెట్టు
ఆయుర్వేద శాస్త్రంలో శతావరిగా పేరొందిన మొక్కను పిల్లి పీచరగా పిలుస్తారు. ఈ మొక్కకు సన్నటి ఆకులు, ముళ్లు కూడా ఉంటాయి. ఇది తీగ జాతికి చెందిన మొక్క. ఈ మొక్క వేసవిలో సైతం పచ్చగా ఉంటుంది. ఎండాకాలంలో పచ్చగా ఉండేందుకు తన వేళ్లలో కొంతనీటిని దాచుకుంటుంది. అందుకు వేర్లు ఉబ్బి గడ్డలుగా తయారవుతాయి. ఆ గడ్డల్లో ఎన్నో విలువైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక కంపెనీ శెతవరెక్స్ పేరుతో గ్రాన్సుల్స్ విడుదల చేసిందంటే దీని విలువ అర్థం చేసుకోవచ్చు. బాలింతలకు పాలు రావడానికి, మూత్రంలో ఇన్ఫెక్షన్ తొలగించి సక్రమంగా పనిచేసేందుకు ఈ మొక్క ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
సరస్వతీదేవితో పాటు సరస్వతీ ఆకు కూడా పూజ్యనీయమే. ఈ ఆకుకు అంతటి విలువ ఉంది. సరస్వతీ ఆకు మొక్కను చక్కని అలంకరణ మొక్కగా కూడా పెంచుకోవచ్చు. ఇది కేవలం పాకాల బుడుగు ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఆకులో ఉండే ఒక రకమైన యాసిడ్ జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో, మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారించేందుకు పనిచేస్తుంది.
పొత్తిదుంప మొక్క సైంటిఫిక్ పేరు గ్లోరియాసిస్ సుపర్బ. ఈ మొక్క కేవలం అటవీ ప్రాంతంలోనే కనిపిస్తుంది. ఐదువేళ్ల ఆకారంలో ఐదు రంగుల్లో ఉంటుంది. దీనిపూత వినాయక చవితికి ముందు పూస్తుంది. ఈ మొక్క విత్తనాల నుంచి తీసే మందు కీళ్ల నొప్పులకు ఎక్కువగా వాడుతుంటారు. ఈ మొక్కకు కింద గడ్డం ఉంటుంది. గిరిజనులు అడవిలోకి వెళ్లినప్పుడు జెర్రి, తాడి జెర్రిలాంటి విషపురుగులు కుడితే మొక్క కింద గడ్డ తీసి గాయంపై పెడితే విష ప్రభావం, మంట, నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే పశువుల్లో వచ్చే జబ్బువాపు రోగానికి గడ్డను దంచి పెడితే ఆ వ్యాధి తగ్గుతుంది.
ఇది అడవిలో విరివిగా కనిపించే మొక్క. ఈ మొక్క రసం పాముకాటుకు, కాళ్లపై వచ్చే ఇన్ఫెక్షన్‌కు ఉపయోగపడుతుంది. శరీరంపై వచ్చే గడ్డలను కూడా నివారిస్తుంది. ఈ మొక్కలు ఎక్కువగా ఔషద గుణాలను కలిగి ఉంటాయి.
అడవిలో అన్నీ ఔషధాలే
అడవిలో అన్నీ ఔషధాలే
అడవిలో అన్నీ ఔషధాలే
అడవిలో అన్నీ ఔషధాలే
అడవిలో అన్నీ ఔషధాలే
అడవిలో అన్నీ ఔషధాలే
అడవిలో అన్నీ ఔషధాలే