
చైన్‌స్నాచర్ అరెస్టు
కై కలూరు: వృద్ధురాలి మెడలో 3 కాసుల బంగారు నానుతాడును లాక్కుని పారిపోయిన వ్యక్తిని కై కలూరు టౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ పి.కృష్ణ, ఎస్సై ఆర్.శ్రీనివాస్‌లు స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 15న వేమవరప్పాడు గ్రామానికి చెందిన బోడావుల గంగామహాలక్ష్మి (70) మెడలో నానుతాడును అదే గ్రామానికి చెందిన బొడ్డు మోజేష్ పల్సర్ బైక్‌పై వచ్చి లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం వాహన తనిఖీల్లో భాగంగా నిందితుడు మోజేష్ పారిపోతుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి గొలుసు స్వాధీనం చేసుకున్నారు. కేసు చేధనలో కృషి చేసిన కై కలూరు టౌన్ ఎస్సై ఆర్.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, నాగార్జున, రాములకు ఏలూరు డీఎస్సీ శ్రావణ్‌కుమార్ నగదు ప్రోత్సహాకాలు అందించారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి విమానగోపుర స్వర్ణమయ పథకానికి ఒక భక్తుడు గురువారం రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. భీమవరంనకు చెందిన కొప్పిరెడ్డి పెద్దిరాజు ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ కార్యాలయంలో జమ చేశారు. దాతకు ఆలయ ఏఈఓ పి.నటరాజారావు విరాళం బాండ్ పత్రాన్ని అందించారు.

చైన్‌స్నాచర్ అరెస్టు