
అమెరికాలో యువ ఆస్ట్రోనాట్‌గా జాహ్నవి దంగేటి
భీమవరం : అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్’ 2029లో నిర్వహించే అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్ కాండిడేట్‌గా పాలకొల్లుకు చెందిన యువతి జాహ్నవి దంగేటి ఎంపికై ంది. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీ కార్యాలయంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో సత్కరించి మంత్రి అభినందనలు తెలిపారు. 2022లో పోలాండ్‌లోని క్రాకోవ్‌లో ఉన్న అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ లో చిన్న వయసులోనే విదేశీ అనలాగ్ ఆస్ట్రోనాట్‌గా, మొదటి భారతీయ మహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట), ఏలూరు రూరల్ : స్థానిక ఆదివారపు పేట ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (ఏఆర్‌డీజీకే) నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల విజయనగరం జిల్లా కొండవెలగాడలో జరిగిన అస్మిత్ ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీ. కాంతి జయకుమార్ తెలిపారు. విద్యార్థిని ఎం.పావని 44 కేజీల విభాగంలో బంగారు పతకం, ఎం. దీక్షిత 44 కేజీల విభాగంలో రజత పతకం, సీహెచ్.కీర్తన 58 కేజీల విభాగంలో రజత పతకం, కే.భార్గవి 58 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించారని తెలిపారు. వీరు ఈనెల 23వ తేదీన విశాఖపట్నంలో జరిగే జోనల్ స్థాయి పోటీలలో పాల్గొంటారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తోట శ్రీనివాస్ కుమార్, అబ్బ దాసరి జోజిబాబు తెలిపారు. విద్యార్థులకు గురువారం పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.
తాడేపల్లిగూడెం రూరల్: అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై జేవీఎన్.ప్రసాద్ తెలిపారు. పెదతాడేపల్లికి చెందిన పుట్టా గోపీ అయ్యప్ప, స్వాతిలకు వివాహం కాగా, కొంతకాలం కాపురం సజావుగా సాగింది. అనంతరం అదనపు కట్నం రూ.10 లక్షలు తీసుకురావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు భర్త గోపీ అయ్యప్ప, అతని కుటుంబ సభ్యులు తిట్టి, కొట్టినట్లు బాధితురాలు స్వాతి గురువారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అమెరికాలో యువ ఆస్ట్రోనాట్‌గా జాహ్నవి దంగేటి