
ధర తక్కువ.. ఆకర్షణీయం
ఆరు అంగుళాల విగ్రహం నుంచి ఆరున్నర అడుగుల ఎత్తులో మట్టి గణనాథుల్ని తయారు చేస్తారు. పర్యావరణం పట్ల అవగాహనతో మట్టి గణనాథుల విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విగ్రహాలు తయారు చేసే వారు తగినంత మంది లేకపోవడం వలన ఉన్నవాళ్లతోనే తయారీ కొనసాగిస్తున్నట్లు సీతారాముడు తెలిపారు. మట్టి గణనాథులు తయారైన పిదప పర్యావరణానికి హాని కలగని విధంగా వాటర్ పెయింట్లు వాడుతున్నామని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల ధరతో పోల్చితే మట్టి గణనాథుల విగ్రహాల ధర తక్కువగా ఉంటుందని, అదేవిధంగా ఆకర్షణీయంగా కూడా ఉంటాయంటున్నారు. గణపతి నవరాత్రుల ఆర్డర్ల మేరకు ఇరవై నుంచి ముప్ఫై విగ్రహాల వరకు తయారు చేస్తుంటామన్నారు.