డిగ్రీ కళాశాలల్లో బదిలీలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ కళాశాలల్లో బదిలీలు చేపట్టాలి

Aug 12 2025 8:03 AM | Updated on Aug 13 2025 4:50 AM

డిగ్రీ కళాశాలల్లో బదిలీలు చేపట్టాలి

డిగ్రీ కళాశాలల్లో బదిలీలు చేపట్టాలి

డిగ్రీ కళాశాలల్లో బదిలీలు చేపట్టాలి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 13 మందికి జరిమానా వ్యాసరచన పోటీల్లో విజేతలు వీరే

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సాధారణ బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బదిలీలతో పాటు అధ్యాపకుల రీ డిజిగ్నేషన్‌, సీఏఎస్‌ వంటి విషయాలపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని గవర్నమెంట్‌ కాలేజ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌, గవర్నమెంట్‌ కాలేజ్‌ గెజిటెడ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఇచ్చిన పిలుపుమేరకు ఈ నిరసన ప్రదర్శన చేశారు. జీసీటీఏ జిల్లా అధ్యక్షుడు ఎం. రాంబాబు, ట్రెజరర్‌ టీవీ దుర్గాప్రసాద్‌, జీజీటీఏ జిల్లా ట్రెజరర్‌ కే. రమేష్‌, ఇతర అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

బుట్టాయిగూడెంలో..

బుట్టాయగూడెం: భోజన విరామ సమయంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అద్యాపకులు నిరసన కార్యక్రమం చేశారు. నిరసన కార్యక్రమం అనంతరం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహేంద్రరావుకు వినతిపత్రాన్ని అందజేశారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 13 మందికి జరిమానా

భీమవరం: భీమవరం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంబేడ్కర్‌ సెంటర్‌, గరగపర్రురోడ్డులోని బీవీ రాజు విగ్రహం ప్రాంతాల్లో మద్యం సేవించి బైక్‌ నడుపుతున్న 13 మందిని అరెస్టు చేసినట్లు టూటౌన్‌ సీఐ జి.కాళీచరణ్‌ సోమవారం చెప్పారు. పట్టుబడిన వారిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారని, అతి వేగంగా బైక్‌ నడిపిన వ్యక్తికి రూ.3 వేల జరిమానా విధించారని సీఐ కాళీచరణ్‌ చెప్పారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో జరిమానా

ఉండి: ఈ నెల 11న ఉండి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో నమోదైన 15 కేసుల్లో ముద్దాయిలను కోర్టుకు తరలించగా సోమవారం వారికి జరిమానాలు విధించినట్లు ఉండి ఎస్సై నసీరుల్లా తెలిపారు.

వ్యాసరచన పోటీల్లో విజేతలు వీరే

భీమవరం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో గాంధీజీ ఆశించిన స్వరాజ్యం అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేత వివరాలను సోమవారం ప్రకటించారు. సీనియర్స్‌ విభాగంలో ఎం.నాగలక్ష్మి(గోపాలపురం), ఎండీ సుమయ్య(నరసాపురం), ఎ.పూజిత(చినఅమిరం), పి.మంజుశ్రీ(గూట్లపాడు), కేఎస్‌.అమూల్య(వైఎస్‌ పాలెం), కె.రిషిత(కేఎస్‌ రామవరం), కె.దివ్య(మండపాక), ఎస్‌.అమృత లక్ష్మీసాయి(చిననిండ్రకొలను) విజేతలుగా నిలిచారు. జూనియర్స్‌ విభాగంలో కె.కుషాలి(బొర్రంపాలెం), డి.కోమలశ్రీ(వేగివాడ కల్లచెరువు), కె.యామిని ఐశ్వర్య(నరసాపురం), ఎన్‌.అక్షిత(చినఅమిరం), ఎ.సరసాదేవి(అరట్లకట్ట), కె.వర్షిత(భీమవరం), పి.ఆనందిత(పెదనిండ్రకొలను), కళాశాల స్థాయిలో ఎం.విజయమణి(తాడేపల్లిగూడెం), ఇ.వరుణ్‌(పెన్నాడ), వై.అవినాష్‌(భీమవరం) విజేతలుగా నిలిచారని వీరికి 13న పెదఅమిరం మహాత్మాగాంధీ ట్రస్‌ వద్ద, ఏలూరులో 14న పెదనిండ్రకొలను మహాత్మాగాంధీ భవనంలో బహుమతులు అందజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement