
దాడిలో విద్యార్థికి గాయాలు
పెదవేగి: పెదవేగి గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి దాడిలో గాయపడ్డ ఆరో తరగతి విద్యార్థిని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఒంటిపై తీవ్రగాయాలు ఉండడంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు జిల్లా ఉన్నతాఽధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఇంటర్ విద్యార్థులు కింది తరగతి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రిన్సిపాల్‌కి చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
సారా కేసులో ఇద్దరి అరెస్టు
కామవరపుకోట: పాత సారా కేసులలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చింతలపూడి ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. మండలంలో జలపావారిగూడెంలో సో మవారం దాడులు నిర్వహించగా నాటు సారా కేసులో పరారీలో ఉన్న నక్కా దావీదు, కళుకులూరి చిన వెంకటేష్‌ను అదుపులోకి తీసుకొని చింతలపూడి కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరు పచ్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.

దాడిలో విద్యార్థికి గాయాలు