వైద్యం.. పూజ్యం | - | Sakshi
Sakshi News home page

వైద్యం.. పూజ్యం

Aug 12 2025 7:55 AM | Updated on Aug 13 2025 5:40 AM

వైద్య

వైద్యం.. పూజ్యం

న్యూస్‌రీల్‌

మంత్రి ఇలాకాలో..

మంచం పట్టిన మన్యం

జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఏలూరు జీజీహెచ్‌, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో పేదలకు పూర్తిస్థాయిలో వైద్యం అందని పరిస్థితి. సోమవారం జిల్లాలోని ఆస్పత్రుల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఓపీ సేవల కోసం గంటల తరబడి పడిగాపులు, డాక్టర్ల కొరత, సమయానికి హాజరుకాని వైద్యులు, పనిచేయని సీటీ స్కానింగ్‌, ఆయా వార్డుల్లో సేవల కోసం ఎదురుచూస్తున్న రోగులు, కదలని 108 వాహనాలు.. ఇలా తదితర సమస్యలెన్నో వెలుగుచూశాయి.

మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో ప్రధాన కేంద్రమైన ఏలూరులో ప్రభు త్వ సర్వజన ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం, నూజివీడులో ఏరియా ఆసుపత్రులు, కై కలూరు, చింతలపూడి, దెందులూరు, భీమడోలు, బుట్టాయగూడెం, పోలవరంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు జిల్లావ్యాప్తంగా 57 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 78 మంది వైద్యులకు 20 పోస్టులు ఖాళీగా ఉండగా, ఉన్న వైద్యులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేరు. అలాగే మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా సగటున 30 శాతానికిపైగా వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేవారు. ఒకరు ఓపీలో సేవలందించగా మరొకరు ఫ్యామిలీ డాక్టర్‌ పేరిట ఇంటింటికీ వెళ్లి గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలందించేవారు. అలాగే పూర్తిస్థాయిలో 108 వాహనాలతో పాటు సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో సైతం గుండెపోటుకు తక్షణమే చేయాల్సిన ఇంజెక్షన్స్‌, అత్యవసర సేవలకు మందులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఏలూరు సర్వజన ఆస్పత్రిలో కూడా ఇవి అందని పరిస్థితి.

వైద్యం.. ప్రహసనం

జిల్లాలోని ఆస్పత్రుల్లో ఔట్‌పేషెంట్‌ వైద్యసేవలు పొందాలంటే ప్రహనసమే. ఏరోజు ఏ వైద్యులు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి. ఏలూరు జీజీహెచ్‌కి సగటున రోజుకు 1,000 నుంచి 1,200 వరకు ఓపీ ఉంటుంది.

వీటిలో 900 మందికిపైగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారే. అలాగే 40 శాతం మందికి ఎక్స్‌రే, సిటీస్కాన్‌, ఈసీజీ, ఇతర స్కానింగ్‌లు అవసరం ఉంటుంది. ఈ క్రమంలో స్కానింగ్‌ పరికరాలు తరచూ మరమ్మతులకు గురికావడం, లేదంటే కనీసం వారం నుంచి నెల రోజులు వేచిచూడటం అనివార్యం. ఒకవేళ అలా ఇచ్చిన తేదీకి వచ్చినా మెషీన్‌ పనిచేస్తేనే స్కానింగ్‌ లేదంటే మరో వారం వేచి చూడాలి. ఆప్తామాలజీ, డెంటల్‌, గైనిక్‌, ఆర్థో, జనరల్‌ మెడిసిన్‌, న్యూరోతో పాటు ట్రామాకేర్‌, అత్యవసర వైద్యసేవలు ఉన్నాయి. అయితే వీటిలో పలు విభాగాల్లో డాక్టర్లు ఒక పూట మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. జీజీహెచ్‌లో 108 వాహనాలు 27 ఉన్నా సమయానికి మాత్రం అందుబాటులో ఉండని పరిస్థితి. ఎమర్జెన్సీ కేసులు విజయవాడ తీసుకువెళ్లాలంటే వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్‌ అంబులెన్స్‌లో తీసుకు వెళ్లాల్సి వస్తోంది.

స్లిప్‌ కోసం ‘ఓపి’క పట్టాల్సిందే..

ఏలూరుతో సహా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ స్లిప్‌ సాధించాలంటే ప్రహసనమే. రోగి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయించడం, అర గంటకుపైగా క్యూలో నిలబడి నమోదయ్యాక ఓటీపీ నంబర్‌ చెప్పడం, ఆ తర్వాత స్లిప్‌ తీసుకుని సంబంధిత వార్డుకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతోంది. ఆయా వార్డుల్లో భారీ క్యూలు ఉండటంతో మరో రెండు గంటలు పడిగాపులు కాస్తేనే గాని డాక్టర్‌ చూడని పరిస్థితి. సుమారు ఏలూరులో 1,200, నూజివీడులో 300, చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో 200కు పైగా ఓపీలు ఉన్నాయి. కైక లూరు మండలం కొల్లేటికోట పీహెచ్‌సీలో అన్నింటికి నర్సే దిక్కు. రెండు డాక్టర్లు పోస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టు ఖాళీగా ఉన్నాయి.

న్యూస్‌రీల్‌

రోగుల పడిగాపులు

వైద్యులు, సిబ్బంది కొరత

స్కానింగ్‌ యంత్రాలకు మరమ్మతులు

అందుబాటులో లేని 108 సేవలు

కూటమి పాలనలో గాడి తప్పిన వైద్యం

ఏజెన్సీలో విషజర్వాల విజృంభణ

మంత్రి ఇలాకాలో..

రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజి వీడు ఆస్పత్రిలో మార్చురీ అవస్థలు అత్యంత దారుణం. ఎవరైనా చనిపోతే శవాన్ని మార్చురీలో పెట్టాలంటే వారే రూ.5 వేలు బయట చె ల్లించి ఐస్‌బాక్స్‌ తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఆరు నెలలుగా ఫ్రీజర్లు పాడైపోవడంతో ప్రమాద కేసుల్లో మృతదేహాలను భద్రపరచడానికి రూ.5 వేలు చెల్లించడం అనివార్యం.

మంచం పట్టిన మన్యం

ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 570 మలేరియా కేసులు నమోద య్యాయి. అలాగే వందల సంఖ్యలో జ్వరాల కేసులు ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్నాయి. బుట్టాయగూడెం మండలంలో కేఆర్‌పురం, నందపురం ఆస్పత్రుల్లో ల్యాబ్‌ టెక్నీషియన్‌, మందులు అందుబాటులో లేకపోవడంతో జంగారెడ్డిగూడెం ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి.

వైద్యం.. పూజ్యం1
1/7

వైద్యం.. పూజ్యం

వైద్యం.. పూజ్యం2
2/7

వైద్యం.. పూజ్యం

వైద్యం.. పూజ్యం3
3/7

వైద్యం.. పూజ్యం

వైద్యం.. పూజ్యం4
4/7

వైద్యం.. పూజ్యం

వైద్యం.. పూజ్యం5
5/7

వైద్యం.. పూజ్యం

వైద్యం.. పూజ్యం6
6/7

వైద్యం.. పూజ్యం

వైద్యం.. పూజ్యం7
7/7

వైద్యం.. పూజ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement