లేటెస్ట్‌ టెక్నాలజీతో.. సరికొత్త లుక్‌లో ఎడ్యుకేషన్‌.సాక్షి.కామ్‌

EducationSakshiCom Is In New Look, With Latest Technology

తాజా ఉద్యోగాల సమాచారం ఈజీగా తెలుసుకునే అవకాశం

కేటగిరి వైజ్‌ సెలక్ట్‌ చేసుకునే అవకాశం

క్వాలిటీ సమాచారమే లక్ష్యంగా..

అన్ని పోటీపరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారం

సాక్షి, ఎడ్యుకేషన్‌: విద్యార్థులు, అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు, ఉద్యోగాన్వేషణకులకు శుభవార్త. విద్యా ప్రపంచంలో విశేష ఆదరణ కలిగిన education.sakshi.com (sakshieducation.com) వెబ్‌సైట్‌ సరికొత్త హంగులతో మీ ముందుకు వచ్చింది. నూతన సాంకేతికతతో వెబ్‌సైట్‌ రూపకల్పన జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో కేంద్ర, రాష్ట్ర పోటీపరీక్షలకు సంబంధించిన  తాజా సమాచారం, సిలబస్, మోడల్‌ పేపర్స్, ప్రీవియస్‌ పేపర్స్, బిట్‌బ్యాంక్, స్టడీ మెటీరియల్, గైడెన్స్, జీకేతో పాటుగా కరెంట్‌ అఫైర్స్‌(తెలుగు మీడియం&ఇంగ్లీషు మీడియం) అందుబాటులో ఉన్నాయి. అలాగే పది, ఇంటర్‌ విద్యార్థులకు ఉపయోగపడే సిలబస్, స్టడీ మెటీరియల్, ఈ–బుక్స్, మోడల్‌ పేపర్స్, ప్రీవియస్‌ పేపర్స్, కేరిర్‌ గైడెన్స్‌ కథనాలు ఉన్నాయి.

తాజా ఉద్యోగ సమాచారం, విద్యా సంబంధిత సమాచారం, కరెంట్‌ ఆఫైర్స్, ఆన్‌లైన్‌ టెస్టులు, పరీక్షల ఫలితాలు, ప్రవేశాలు, స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్, వీడియోలు, ప్రాక్టీస్‌ టెస్టులతోపాటు ఈ–బుక్‌లు కూడా నూతన వెబ్‌సైట్‌లో ఉన్నాయి. కావాల్సిన సమాచారాన్ని కేటగిరి వైజ్‌ ఎంపిక చేసుకుని తెలుసుకునే సౌలభ్యం ఉంది. నాణ్యమైన విద్యా సంబంధిత కంటెంట్‌ను అందించడమే education.sakshi.com లక్ష్యం. మీ బంగారు భవిష్యత్‌కు ఎడ్యుకేషన్‌.సాక్షి తోడుగా ఉంటుంది సగౌరవంగా చెప్పగలం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న సాక్షి ఎడ్యుకేషన్‌ వీక్షకులకు కృతజ్ఞతలు..ఇలాగే ఇకపై మరింత ఎక్కువగా ఆదిస్తారని కోరుకుంటున్నాం.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top