అప్పుల ఊబిలో లబ్ధిదారులు | - | Sakshi
Sakshi News home page

అప్పుల ఊబిలో లబ్ధిదారులు

Nov 20 2026 12:13 AM | Updated on Nov 20 2026 12:13 AM

సొంతింటి నిర్మాణం కోసం పేదలు పడుతున్న కష్టాలు మాటల్లో చెప్పలేం. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలన్న ఆశతో కొందరు తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్మును వెచ్చించారు. మరికొందరు అప్పులు చేసి పునాదులు, గోడలు నిర్మించుకున్నారు. అయితే నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు రావాల్సిన బిల్లులను చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో అందించకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇప్పటికే అప్పులు చేసి నిర్మాణాలు ప్రారంభించినవారు వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సాయం అందకపోవడంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేక, మరోవైపు అద్దె ఇళ్లలోనే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. పునాదులు వేసి, గోడలు నిర్మించిన ఇళ్లు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. సొంతింటిలోకి ఎప్పుడు చేరుతామో తెలియని దుస్థితి నెలకొందని, రాజమహేంద్రవరం నగరంలోని అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్నామని వేలాది మంది లబ్ధిదారులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement