కోడ్‌ను అమలు చేశారు.. | - | Sakshi
Sakshi News home page

కోడ్‌ను అమలు చేశారు..

Nov 20 2026 12:13 AM | Updated on Nov 20 2026 12:13 AM

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): స్థానిక ఇన్నీసుపేట బాలికల ఉన్నత పాఠశాల పక్కన లేబర్‌అడ్డాపై చంద్రబాబు ఫొటో ఉండడంతో ‘ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన’ శీర్షికన సాక్షి దినపత్రికలో గురువారం వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన నగరపాలక సంస్థ అధికారులు ఆ ఫొటోకు ముసుగు వేశారు.

మర్రిపూడిలో

పిచ్చికుక్క బీభత్సం

11 మందిపై దాడి

రంగంపేట: మండల పరిధిలోని మర్రిపూడి గ్రామంలో గురువారం పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. దీని దాడిలో 11 మంది గ్రామస్తులు గాయపడ్డారు. వారిలో పలువురు వృద్ధులు ఉన్నారు. బాధితులను వారి బంధువులు హుటాహుటిన పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి 11 మంది కుక్కకాటుకు గురి కావడంతో గ్రామంలో కలకలం రేగింది.

ఆక్వాన్‌ ముప్పు తప్పినట్టే

సాక్షి, అమలాపురం: తుపాను వస్తోందంటేనే వణికిపోయే పరిస్థితి.. అందులోనూ వరుస తుపానుల దెబ్బతో కోలుకోలేకపోతున్న కోనసీమ రైతులకు మరో ముప్పు పొంచి ఉందన్న వాతావరణ హెచ్చరికలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆక్వాన్‌ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీస్తాయన్న ఆందోళన జిల్లాలో నెలకొంది. అయితే, గురువారం సాయంత్రం వరకూ జిల్లాలో తుపాను ప్రభావం పెద్దగా కనిపించ లేదు. వాతావరణంలో మార్పులు మినహా చెప్పుకోదగిన వర్షాలు, గాలులు లేకపోవడంతో ప్రస్తుతానికి తుపాను ముప్పు తప్పినట్టేనన్న భావన వ్యక్తమవుతోంది. భారీ వర్షాలు కురవకూడదని రైతులు కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. అర్నబ్‌, మురసు తుపాన్లు ఇప్పటికే కోనసీమ వ్యవసాయ, ఉద్యాన రంగాలను తీవ్రంగా దెబ్బ తీశాయి. వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగి, నీట మునిగి రైతులకు నష్టాన్ని మిగిల్చింది. మరోవైపు కొబ్బరి చెట్లు నేల కూలడంతో పాటు, మొవ్వులు విరిగి రైతులు ఏళ్ల తరబడి ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అరటి, ఇతర ఉద్యాన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది.

వర్షం పడినా కష్టమే..

ప్రస్తుతం వరి కోతలు, నూర్పిళ్లకు సంబంధించి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నేలకొరిగిన వరి చేలను కాపాడుకునేందుకు నానా అవస్థలూ పడుతున్నారు. ఈ సమయంలో భారీ వర్షాలు కురిస్తే కోతలకు సిద్ధంగా ఉన్న పంటతో పాటు కోసిన ధాన్యం కూడా తడిసిపోయే ప్రమాదం ఉంది. తేమ కారణంగా ధాన్యం నాణ్యత దెబ్బ తినడంతో పాటు కొనుగోళ్లలోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు కొబ్బరి, ఇతర ఉద్యాన పంటల రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. తుపానుల కారణంగా దెబ్బ తిన్న తోటలు ఇంకా కోలుకోలేదు. ఈ తరుణంలో బలమైన గాలులు వీస్తే మిగిలిన చెట్లు, పంటలకూ నష్టం వాటిల్లుతుందనే భయం వారిని వెంటాడుతోంది.

తుపాను గండం తప్పినా..

ఆక్వాన్‌ తుపాను కదలికలు, తీరం వైపు దాని ప్రయాణంపై వాతావరణ శాఖ హెచ్చరికలను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతానికి ప్రభావం కనిపించకపోయినా వర్షాల విషయంలో మాత్రం వారిని ఆందోళన వీడటం లేదు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గి, వాతావరణం అనుకూలంగా మారితేనే పంటలను కాపాడుకోగలమని భావిస్తున్నారు. తుపాను ముప్పు కంటే దాని ప్రభావంతో కురిసే వర్షాలే తమకు ఎక్కువ నష్టం కలిగిస్తాయని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement