అధ్వానంగా రహదారులు | - | Sakshi
Sakshi News home page

అధ్వానంగా రహదారులు

Nov 20 2026 12:13 AM | Updated on Nov 20 2026 12:13 AM

కాలనీల్లోకి వెళ్లాలంటేనే నివాసితులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు కూడా అధ్వానంగా తయారయ్యాయి. గత ప్రభుత్వంలో తాత్కాలిక రోడ్డు వేశారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాక పూర్తి స్థాయిలో రహదారుల నిర్మాణం చేపట్టాలని భావించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో కూటమి పాలన మొదలయ్యాక ఆ రోడ్లను అలానే వదిలేయడంతో ప్రస్తుతం గుంతలు, మట్టి దారులే దర్శనమిస్తున్నాయి. వాహనాలపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. బురదలో నడవలేక, గుంతల్లో వాహనాలు దిగబడిపోతుండటంతో నివాసితులు అవస్థలు పడుతున్నారు. పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లాలన్నా, కూలి పనులకు వెళ్లాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకోవాలన్నా రహదారులే ప్రధాన సమస్యగా మారాయి. ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్న కొద్దీ జనాభా పెరుగుతోంది. కానీ అందుకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం మాత్రం జరగడం లేదు. కాలనీల్లో రహదారుల నిర్మాణానికి గత రెండున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement