ట్రాన్స్‌ఫార్మర్లు మాయం | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్లు మాయం

Nov 20 2026 12:13 AM | Updated on Nov 20 2026 12:13 AM

వెలుగుబంద కాలనీలో విద్యుత్‌ సరఫరా మరో ప్రధాన సమస్యగా మారింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో కాలనీ అవసరాల కోసం ప్రత్యేకంగా విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అయితే ఇళ్ల నిర్మాణాలు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో విద్యుత్‌ వినియోగం తక్కువగా ఉందనే కారణంతో అక్కడి ట్రాన్స్‌ఫార్మర్లను చంద్రబాబు ప్రభుత్వంలో ఇతర ప్రాంతాలకు తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కటిగా ట్రానన్స్‌ఫార్మర్లు తొలగించడంతో కాలనీలో విద్యుత్‌ సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు పెరుగుతున్నా విద్యుత్‌ సరఫరాకు అవసరమైన సామర్థ్యం లేకపోవడంతో లోవోల్టేజీ సమస్య వేధిస్తోందని, ఫ్యాన్లు సరిగ్గా తిరగడం లేదని, ఇతర విద్యుత్‌ ఉపకరణాలు పనిచేయడం లేదని వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అవి కాలిపోతున్నాయని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement