క్లుప్తంగా
ఓటర్లూ.. గుర్తుపెట్టుకోండి
● నిందితుడిపై పోక్సో కేసు
● రిమాండ్‌కు తరలింపు
● ప్రసాదం తయారీకీ మార్కులు
● దేవస్థానానికి ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్
ధ్రువీకరణ పత్రం
● పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక గుర్తులు
● కానరాని రాజకీయ పార్టీల చిహ్నాలు
కపిలేశ్వరపురం: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి, రెండో విడతలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు కనబడవు. పండ్లు, కాయగూరలు, రోజువారీ జీవితంలో వినియోగించే సామాగ్రిని గుర్తులుగా కేటాయిస్తారు. దానికి సంబంఽధించి ఎన్నికల సంఘం విధి విధానాలను రూపొందించింది. 2026 ఎన్నికల మార్గదర్శకాలు ప్రకారం సర్పంచ్‌లకు కేటాయించేందుకు 25, వార్డు సభ్యులకు కేటాయించేందుకు 20 గుర్తులు నిర్ధేశించారు. వీటికి అదనంగా నోటా ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగితే అదనపు గుర్తులు కేటాయిస్తారు.
అక్షర క్రమంలో..
పోటీలో నిలిచిన అభ్యర్థి తనకు నచ్చిన గుర్తు దక్కించుకోవాలని ఆశిస్తాడు. కానీ ఎన్నికల నియమావళి ప్రకారం ఏ అభ్యర్థికై నా గుర్తును కేటాయించేందుకు కొన్ని నియమాలను రూపొందించింది. దాని వల్ల అభ్యర్థి కోరుకున్న గుర్తును అధికారి కేటాయించే వీలు లేదు. అభ్యర్థుల పేరులోని అక్షర క్రమం ఆధారంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తులను కేటాయించి గుర్తు నమూనాను అభ్యర్థికి అందిస్తారు. నామినేషన్లు పరిశీలన, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోటీలో మిగిలిన అభ్యర్థుల పేరులోని తెలుగు అక్షర క్రమం ప్రకారం జాబితాను రూపొందిస్తారు. జాబితాను సంబంధిత కార్యాలయ నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు. అనంతరం ఎన్నికల సంఘం గుర్తుల జాబితా నుంచి అభ్యర్థుల వరుస క్రమం ప్రకారం గుర్తులను కేటాయిస్తారు.
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు
మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు–సాసర్, క్యారెట్, తాళం–చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపండ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా తదితర గుర్తులు కేటాయిస్తారు.
వార్డు సభ్యులకు...
ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూలు, ఇసీ్త్రపెట్టె, పోస్టు డబ్బా, గ్యాస్ పొయ్యి, బీరువా, ఐస్‌క్రీమ్, కెటిల్, కట్టింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటిన్నా, బెండకాయ, వయోలిన్, బెల్టు, కోటు తదితర గుర్తులను కేటాయిస్తారు.
● పల్లె పోరులో ఖర్చుకు కళ్లెం
● ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే..
● 45 రోజులే గడువు, లేదంటే అనర్హత వేటే
మామిడికుదురు: ‘ఊరి’కే ఖర్చు చేద్దాం అంటే కుదరదు.. ఎన్నికల వేళ అభ్యర్థులు ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే. నిబంధనలు పాటించాల్సిందే లేకుంటే అనర్హత వేటు తప్పదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతగా ఈ నెల 26వ తేదీన అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోని 177 పంచాయతీ సర్పంచ్‌లకు, 2,016 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 29న కొత్తపేట, రామచంద్రపురం డివిజన్ల పరిధిలోని తొమ్మిది మండలాల్లోని 165 పంచాయతీలకు, 1,862 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు విషయంలో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలో అయితే సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.60 వేలు, 10 వేలు జనాభా దాటితే సర్పంచ్ అభ్యర్థులు రూ.4 లక్షలు, వార్డు సభ్యులు రూ.లక్ష మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిపై ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
నామినేషన్ వేసినప్పటి నుంచి..
నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి అభ్యర్థి ఖర్చు చేసే ప్రతి పైసా ఎన్నికల లెక్కల కింద చూపించాల్సిందే. దీని కోసం ప్రతి అభ్యర్థి ఒక నగదు పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో రోజు వారీ ఎంత ఖర్చు చేశారో చూపించాలి. పోటీలో ఉన్న అభ్యర్థులు స్వయంగా చేసే మొత్తాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఎన్నికల వ్యయ పరిశీలకులను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి రెండు రోజులకు ఒకసారి వ్యయం వివరాలను అభ్యర్థి రిటర్నింగ్ అధికారితో తనిఖీ చేయించుకోవాలి. ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోపు వ్యయానికి సంబంధించిన వివరాలు తప్పనిసరిగా ఆ గ్రామ పంచాయతీలో అందజేయాలి. ఆ తర్వాత కూడా స్పందించకపోతే ఎన్నికల్లో విజయం సాధించి వారు తమ పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఐదుగురికి జైలు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ట్రాఫిక్ డీఎస్పీ వై.శ్రీకాంత్ నేతృత్వంలో సీఐ అబ్దుల్ నబీ బృందం చేపట్టిన తనిఖీల్లో 45 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చడంతో పాటు 45 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసేందుకు రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ కేసులను విచారించిన రాజమహేంద్రవరం ఒకటో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ పి.ఈశ్వరి మొత్తం 40 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.4 లక్షలు జరిమానా విధించారు. మిగిలిన వారిలో ఒకరికి 20 రోజులు, మరొకరికి 5, 3, 2 రోజుల చొప్పున మొత్తం ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
బాలిక కిడ్నాప్, బలవంతంగా పెళ్లి
సీతానగరం: బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లి చేసుకున్న నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఎస్సై ఎల్.శ్రీను నాయక్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. రఘుదేవపురానికి చెందిన ఉక్కుసూరి దుర్గాప్రసాద్ (23) స్థానికంగా ఓ పాఠశాలలో చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 8న బాలికను కిడ్నాప్ చేసి బైక్‌పై రాజమహేంద్రవరం మీదుగా అప్పనపల్లి ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా పెళ్లి చేసుకుని హైదరాబాద్ తీసుకెళ్లిపోయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా, నార్త్ జోన్ డీఎస్పీ జీవన విచారణ జరిపారు. ఈ మేరకు దుర్గాప్రసాద్‌ను రాపాక సెంటర్ వద్ద బుధవారం డీఎస్పీ జీవన అరెస్ట చేసి, కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
అదుపు తప్పిన కంటైనర్
మామిడికుదురు: జాతీయ రహదారిపై గెద్దాడలో గురువారం ఓ కంటైనర్ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకుపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. భీమవరం నుంచి కోల్‌కతాకు చేపల లోడుతో వెళ్లి తిరిగి వస్తున్న కంటైనర్ గెద్దాడ వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయింది. ఆ క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కంటైనర్ ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
అన్నవరంలో భోజనం నాణ్యత భేష్
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానానికి భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)వారి ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ధ్రువీకరణ పత్రం లభించింది. ఈ మేరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు పొందిన ఆడిట్ సంస్థ సర్టికో క్యూఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు బి.శీల, జి.శివకుమార్ గురువారం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావుకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. స్వామివారి ప్రసాదం, అన్నదాన పథకంలో భోజనం నాణ్యత, వాటి తయారీలో వాడే దినుసులు, వంటశాలలో పరిశుభ్రత, తాగునీరు, వ్యర్థాల నిర్వహణ, ఆహార భద్రతా నిబంధనలు తదితర అంశాలన్నీ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. కాగా.. అన్నవరం దేవస్థానానికి రెండేళ్ల క్రితం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంస్థ ప్రసాదాల నాణ్యత నిబంధనలకు అనుగుణంగా ఉన్నందున భోగ్ ధ్రువీకరణ పత్రం అందజేసింది. తాజాగా ఈట్ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ పత్రం కూడా లభించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతితో సర్టికో క్యూఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు గత ఆగస్టులో అన్నవరం దేవస్థానంలో ప్రసాదం, అన్నదానం విభాగాలను పరిశీలించి ప్రసాదం, భోజనం నాణ్యతపై ఆడిట్ నిర్వహించారు. అనంతరం ఆ నివేదికను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకు పంపించగా, ఆ సంస్థ ఆమోదించడంతో ఈ ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఇది రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని తెలిపారు.
22న సాఫ్ట్ బాల్ జట్ల ఎంపిక
ఐ.పోలవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ పురుషుల, మహిళా జట్ల ఎంపికను ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్టు అసోసియేషన్ సెక్రటరీ అడ్డగళ్ల నాగ రాంప్రసాద్ గురువారం తెలిపారు. ఆ రోజు మఽ ద్యాహ్నం 2 గంటలకు ఐ.పోలవరం మండలం జి.వేమవరం హైస్కూల్ మైదానంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎంపికై న జట్లు చిత్తూరులో డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయన్నారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ తరఫున సబ్ జూనియర్, జూనియర్ స్థాయిలో కనీసం ఒక్క టోర్నమెంట్ అయినా ఆడి ఉండాలన్నారు.
వెయిట్ లిఫ్టింగ్‌లో తరంగిణి ప్రతిభ
నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ)/రాజానగరం: దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థిని కె.తరంగణి ప్రతిభ చూపింది. చైన్నెలోని మిషిన్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న పోటీల్లో 61 కేజీల విభాగంలో స్నాచ్‌లో 83 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 108 కేజీలు.. మొత్తం 189 కేజీల బరువును ఎత్తి ప్రథమస్థానంలో నిలిచి, బంగారు పతకం సాధించింది. ఆమెను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మెహర్, పీడీ రమణ అభినందించారు. అలాగే ఆదికవి నన్నయ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాకినాడ పీఆర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థిని తరంగిణి ప్రతిభ అభినందనీయమని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ అభినందించారు.
బైక్ అదుపు తప్పి యువకుడి మృతి
కోరుకొండ: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరు అపస్మారక స్థితిలో ఉన్నాడు. కోరుకొండ మండలం నర్సాపురం శివారున గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం.. కోరుకొండలోని వడ్డీల వీధికి చెందిన బల్లా గంగాధర్ (24), దోమ శివ మోటార్ సైకిల్‌పై గాదరాడలోని స్నేహితుడి ఇంటికి వెళుతున్నారు. నర్సాపురం శివారును వీరి బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. బైక్ నడుపుతున్న గంగాధర్ తలకు బలమైన గాయం కావడంతో, తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న శివకు గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరాడు. అతడిని అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు.
అక్రమ మైనింగ్‌పై అధికారుల దాడి
పెద్దాపురం: మండల పరిధిలోని రామేశంమెట్టలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై గురువారం రెవెన్యూ, గనుల శాఖ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా మట్టి తవ్వకాలు, తరలింపునకు ఉపయోగిస్తున్న ఐదు జేసీబీలు, రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాలన్నింటినీ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. కాగా.. దాడి జరిగిన సమయంలో అక్కడ ఎవరూ అందుబాటులో లేరని, అక్కడున్న వాహనాలన్నింటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు సత్యతేజ, రవీంద్ర ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది.
విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా క్రీడామైదానంలో గురువారం విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు జరిగాయి. వీటిని జిల్లా ఖజానా శాఖ అధికారి గణేష్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ సాధించిన విజయంతో రాష్ట్ర, జాతీయస్థాయిలో కూడా ప్రతిభను చాటాలని సూచించారు. కార్యక్రమానికి డీఎస్‌డీఓ వి.సతీష్ కుమార్ అధ్యక్షత వహించారు. పారా అథ్లెట్స్, పారా బ్యాడ్మింటన్, పారా వీల్ చైర్, బ్లైండ్ గోల్ బాల్, పారా తైక్వాండోలో పోటీలు నిర్వహించారు. 300 మంది ఈ పోటీలకు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర పారా క్రీడల పరిశీలకులు పురుషోత్తం, విభిన్న ప్రతిభావంతుల శాఖ సంచాలకులు శ్రీనివాస్, డీఎస్‌ఏ కోచ్‌లు పాల్గొన్నారు.
డ్వాక్రా సమావేశంలో
మహిళపై కత్తితో దాడి
అనపర్తి: డ్వాక్రా సంఘ సమావేశంలో గ్రూపు నిధుల విషయమై తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేశాడు. బిక్కవోలు మండలం ఊలపల్లిలోని ఎస్సీ పేటలో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఊలపల్లి ఎస్సీ పేటకు చెందిన నుతిక కుమారి మరో పది మంది మహిళలతో కలిసి డ్వాక్రా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రూపు నిధుల లావాదేవీలపై యానిమేటర్ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. సభ్యుల నుంచి రూ.4,500 వసూలు చేసి చిన్నాడ చిన్నారికి అందజేశానని, అయితే ఆమె ఆ మొత్తాన్ని స్వీకరించలేదని కుమారి వెల్లడించింది. దీంతో అక్కడే ఉన్న చిన్నారి భర్త జొన్నాడ యోగి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుమారిని అసభ్య పదజాలంతో దూషించి, జుట్టు పట్టుకుని కొట్టడమే కాకుండా కత్తితో తల వెనుక భాగం, ఎడమ భుజంపై దాడి చేశారు. సమాచారం అందుకున్న కుమారి భర్త ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన కుమారిని చికిత్స నిమిత్తం అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ తెలిపారు.
క్రీడా సమాచారం
లెక్కల చిట్టా పక్కాగా ఉండాలి
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి 45 రోజుల్లోగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన చిట్టా సమర్పించాలి. లేనిపక్షంలో వారిపై అనర్హత వేటు పడుతుంది. దీంతో పాటు తదుపరి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిషేధం కూడా అమలు చేసే అధికారం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఈ విషయాన్ని గమనించి లెక్కలను పక్కాగా సమర్పించాలి.
– జి.భవాని, ఏఆర్‌ఓ, మామిడికుదురు


