కత్తిపూడి చోరీ కేసులో నలుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కత్తిపూడి చోరీ కేసులో నలుగురి అరెస్ట్‌

Nov 20 2026 12:13 AM | Updated on Nov 20 2026 12:13 AM

అన్నవరం: కత్తిపూడిలోని ఒక ఇంట్లో గత నెల 25న జరిగిన చోరీ ఘటనలో నలుగురిని అరెస్ట్‌ చేసి, వారి నుంచి 116 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి ఆభరణాలు, ఐ ఫోన్‌, నగదు రికవరీ చేసినట్టు ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు తెలిపారు. ఆయన గురువారం సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. కత్తిపూడికి చెందిన పాలాద్రి వీర దుర్గాశేఖర్‌ గత నెల 25న తన ఇంటికి తాళాలు వేసి ఊరెళ్లారు. తిరిగి 26న వచ్చే సరికి ఇంట్లో దొంగలు చొరబడి 116 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి ఆభరణాలు, నగదు, ఐ ఫోన్‌ను చోరీ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ బిందు మాధవ్‌ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్‌ పర్యవేక్షణలో సీఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు, కాల్‌ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో కత్తిపూడికి చెందిన వెలుగుల ప్రసాద్‌, పాలాద్రి శ్రీనివాసరాజు, జ్యోతుల వీరబాబు, నెల్లిపూడికి చెందిన దొండ దుర్గారావు ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. వారిని గురువారం కత్తిపూడి సమీపంలో పోలవరం కాలువ వద్ద అరెస్ట్‌ చేశారు. విలేకరుల సమావేశంలో అన్నవరం ఎస్‌ఐ శ్రీహరిబాబు, అడిషనల్‌ ఎస్‌ఐ ఎల్‌ ప్రసాద్‌, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement