గోదావరి పుష్కరాలకు పటిష్ట కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు పటిష్ట కార్యాచరణ

Nov 19 2026 12:07 AM | Updated on Nov 19 2026 12:07 AM

రాజమహేంద్రవరం సిటీ: గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని పుష్కరాల ప్రత్యేక అధికారి ఎస్‌.సురేష్‌ కుమార్‌ ఆదేశించారు. ఆయన బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జాయింట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా అధ్యక్షతన ఉన్నత స్థాయి అంతర్‌ శాఖల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ కీర్తి చేకూరి, జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘ స్వరూప్‌, ఎస్పీ డి.నరసింహ కిశోర్‌, రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ శుభం నొఖ్వాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాహుల్‌ మీనా తదితరులు పాల్గొన్నారు. పుష్కరాల కోసం వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, ఘాట్ల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌, రవాణా, భద్రత, సమాచార వ్యవస్థలపై శాఖల వారీగా సమీక్షించారు. ఆయా పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయనే అంశాలను పరిశీలించి, పరిపాలనా అనుమతులు, నిధుల మంజూరు, టెండర్ల ప్రక్రియ, పనుల ప్రారంభం, పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.

ఫ రాజమహేంద్రవరం, గోదావరి, కొవ్వూరు రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే ప్రయాణికులకు కల్పించే వసతులపై చర్చించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఘాట్ల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, మురుగునీటి శుద్ధి, రహదారులు, వీధి దీపాలు, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. కొవ్వూరు, మండపేట మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. లక్షల మంది భక్తులు ఒకేచోట చేరే సమయంలో మొబైల్‌, ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటం అత్యంత కీలకమన్నారు.

ఫ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలి

ఫ పుష్కరాల ప్రత్యేక అధికారి

సురేష్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement