కపిలేశ్వరపురం(మండపేట): కేశవరం గ్రామానికి చెందిన 50 మంది మంగళవారం రాత్రి వైఎస్సార్ సీపీలో చేరారు. గ్రామానికి చెందిన కడగల దుర్గాప్రసాద్, బన్నీ, రవికుమార్, ఉదయ్ రాజు, సతీష్, దుర్గా ప్రసాద్, సాయి హర్ష, తులసీ దుర్గా ప్రసాద్, శ్రీచరణ్, హేమంత్, మణికంఠ, రాజేష్, రమేష్ తదతర యువకులు సమావేశమై గ్రామాభివృద్ధి వైఎస్సార్ సీపీ ద్వారానే సాధ్యమని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీశ్రీ, వెంకన్నబాబు పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. వెంకన్నబాబు మాట్లాడుతూ సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం పని చేయాలనుకునే వారికి వైఎస్సార్ సీపీ సరైన వేదిక అన్నారు. కార్యక్రమంలో నాయకులు తుపాకుల ప్రసన్నకుమార్, గంధం సూరిబాబు, విన్నకోట ప్రసాద్, కొల్లి శేఖర్, బి.అప్పారావు పాల్గొన్నారు.


