ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 26, 29, డిసెంబర్‌ 2న పోలింగ్‌ జరగనుండటంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. జిల్లాలోని మండలాలను మూడు విడతలుగా విభజించి, మొత్తం 4,082 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్‌, కడియం, గోకవరం మండలాలు, కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని చాగల్లు, కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో తొలి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటి పరిధిలోని 121 పంచాయతీలు, 1,444 వార్డుల కోసం 1,550 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్‌ఈసీ ఎన్నికల ప్రకటన విడుదల చేయనుంది.

ప్రతి మండలానికో ప్రత్యేక అధికారి

ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నారు. వీరు ఆయా మండలాల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలింపు, సిబ్బంది నియామకం, శిక్షణ, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పోలింగ్‌ నిర్వహణతోపాటు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలోనూ ఎక్కడా జాప్యం జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ప్రణాళికతో..

రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ 14న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన జారీ చేసింది. మొదటి విడతకు సంబంధించి శుక్రవారం (ఈ నెల 13న) రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేయనుంది. అనంతరం జిల్లాలోని ఎన్నికల అధికారులు 15న నోటిఫికేషన్‌ విడుదల చేసి అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 17 వరకూ నామినేషన్లు స్వీకరించి వాటిని 18న పరిశీలించనున్నారు. తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్ల స్వీకరణ, పరిష్కారం అనంతరం అభ్యర్థిత్వాల ఉపసంహరణకు నవంబర్‌ 21 సాయంత్రం వరకూ అవకాశం ఇస్తారు. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు.

గుర్తుల కేటాయింపు

పోటీలో నిలిచే అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికల గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది. సర్పంచ్‌ అభ్యర్థులకు వేరుగా, వార్డు సభ్యులకు వేరుగా గుర్తులను రిజర్వ్‌ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత పోటీలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. తొలి విడత పోలింగ్‌ ఈ నెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం అదే కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. అవసరమైన చోట నవంబర్‌ 27న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించనున్నారు.

తొలి విడత ఎన్నికలు జరిగే మండలాలు

మండలం పంచాయతీలు వార్డులు పోలింగ్‌

కేంద్రాలు

రాజమహేంద్రవరం

రూరల్‌ 01 18 36

కడియం 10 138 172

గోకవరం 14 166 184

చాగల్లు 13 154 174

కొవ్వూరు 16 190 190

తాళ్లపూడి 11 134 134

నిడదవోలు 23 250 250

పెరవలి 18 208 208

ఉండ్రాజవరం 15 186 202

మొత్తం 121 1,444 1,550

ఫ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఫ నేడు తొలి విడత పోరుకు

ఎస్‌ఈసీ ప్రకటన

ఫ 9 మండలాల్లో ఈ నెల

15 నుంచి నామినేషన్ల స్వీకరణ

ఫ 21న అభ్యర్థుల తుది జాబితా,

26న పోలింగ్‌

ఫ అవసరమైనచోట

27న రీ పోలింగ్‌

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్థుల ఎంపికల్లో వివిధ పార్టీల నాయకులు బిజీగా ఉన్నారు. కొందరు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

అభ్యర్థులకు మార్గదర్శకాలు

ఫ పోటీ చేసే అభ్యర్థులకు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు పోటీకి అనర్హులు.

ఫ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్ద నామినేషన్‌ పత్రాలు (ఫారం –3) తీసుకోవాలి.

అభ్యర్థితో పాటు ప్రపోజర్‌ సంతకాలతో దాఖలు చేయాలి.

ఫ ప్రపోజర్‌ అదే గ్రామ పంచాయతీలో

ఓటరుగా ఉండాలి. నామినేషన్‌ పత్రాన్ని అభ్యర్థి స్వయంగా లేదా ప్రపోజర్‌ ద్వారా సమర్పించవచ్చు.

ఫ ఓటరు కార్డు జిరాక్స్‌పై అభ్యర్థి సంతకాలుండాలి. నాలుగు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, వయసు ధ్రువీకరణ పత్రం, లేదంటే

10వ తరగతి సర్టిఫికెట్‌ సమర్పించాలి.

ఫ పంచాయతీకి పన్ను బకాయిలు లేవని

పంచాయతీ కార్యదర్శి నుంచి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ తీసుకుని సమర్పించాలి

ఫ నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హత, పిల్లల వివరాలతో పాటు ఇద్దరు సాక్షులు సంతకాలు చేసిన అఫిడవిట్‌ సమర్పించాలి.

ఫ సర్పంచ్‌కి సంబంధించి జనరల్‌ అభ్యర్థులకు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకై తే రూ.1500 డిపాజిట్‌ చెల్లించాలి.

ఫ ఒక అభ్యర్థి ఒకటి కంటే నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పటికీ ఏదో ఒక నామినేషన్‌ నిలుస్తుంది.

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారుల నుంచి మార్గదర్శకాలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ 2022 ఎన్నికల బడ్జెట్‌తో పోల్చి ప్రస్తుత ఎన్నికలకు అవసరమైన అదనపు నిధులపై స్పష్టమైన అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. పోలింగ్‌ సిబ్బంది, ఫీల్డ్‌ లెవల్‌ అధికారులు, బూత్‌ లెవల్‌ అధికారులు, ఎంపీడీవోల బృందాలు తదితర సిబ్బందికి చెల్లించాల్సిన అలవెన్సులు, కొత్త స్కేళ్ల ప్రకారం డీఏ, డీఎస్‌ తదితర వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు పంపాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement