కలలు కనండి.. సాకారం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

కలలు కనండి.. సాకారం చేసుకోండి

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయండి అని విద్యార్థులకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ఎస్‌.ప్రసన్నశ్రీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో 2020 – 23 బ్యాచ్‌ యూజీ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలను గురువారం ఆనం కళాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.కృష్ణ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానం 2020 అమలు, డిజిటల్‌ సంస్కరణల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర ఆర్‌కే మాట్లాడుతూ 173 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల ఎందరో మేధావులను, ప్రతిభావంతులను దేశానికి అందించిందన్నారు. కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ కండ్రకుంట బాబు వార్షిక పరీక్షల నివేదికను సమర్పించారు. 2020 – 23 బ్యాచ్‌కు సంబంధించి సెమిస్టర్‌ పరీక్షలకు మొత్తం 1,948 మంది విద్యార్థులు హాజరు కాగా, 1,625 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 83.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సైన్స్‌ విభాగంలో 1,115 మందికి 963 మంది, కామర్స్‌ విభాగంలో 460 మందికి 384 మంది, ఆర్ట్స్‌ విభాగంలో 373 మందికి 278 మంది ఉత్తీర్ణులయ్యారు. 51 యూజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 55 బంగారు పతకాలను ప్రదానం చేశారు. పట్టాలు పొందిన వారిలో పలువురు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సాధించగా, మరికొందరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

ఫ నన్నయ వీసీ ప్రసన్నశ్రీ

ఫ ఆర్ట్స్‌ కళాశాలలో

యూజీ గ్రాడ్యుయేషన్‌ డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement