పురుషులు 2,23,637
మహిళలు 2,39,615
ఇతరులు 70
డివిజన్లు 72
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం నగర పాలక సంస్థకు ఎన్నికల కళ వచ్చింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 26న ఎన్నికలు, 30న కౌటింగ్ నిర్వహించనున్నారు. విలీన పంచాయతీలు కలిసిన తర్వాత గ్రేటర్ రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో 72 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 4,63,322 మంది ఓటర్లలో 2,23,637 మంది పురుషులు, 2,39,615 మంది మహిళలు, ఇతరులు 70 మంది ఉన్నారు. ఇప్పటి వరకూ జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా గత 8 సంవత్సరాలుగా నగర పాలక సంస్థ కొనసాగుతోంది. 2014 జూలై 3 నుంచి 2018 జూలై 2వ తేదీ వరకూ ఐదేళ్ల పాటు అప్పటి పాలక వర్గం పాలన చేసింది. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా విలీన గ్రామ పంచాయతీల సమస్యతో కోర్టులను ఆశ్రయించడంతో ఇప్పటి వరకూ సుమారు 8 ఏళ్లు ఎన్నికలు జరగలేదు.
అభ్యర్థుల ఎంపిక
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో వైఎస్సార్ సీపీ మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధం చేసింది. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ తమ అభ్యర్థులను రెడీ చేశాయి. 72 డివిజన్లలో జనరల్ మహిళలకు 19, ఎస్సీ మహిళలకు 5, బీసీ మహిళలకు 12, ఓపెన్ కేటగిరీలో 17, బీసీ జనరల్‌కు 13, ఎస్సీ జనరల్‌కు 5, ఎస్టీ జనరల్‌కు ఒక్క డివిజన్ కేటాయించారు. నగర పాలక సంస్థ పరిధిలో 494 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు 24 రూట్లను ఏర్పాటు చేసి రిటర్నింగ్ అధికారులు 24 + 1 (మేయర్ స్థానానికి), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 24 +1 (మేయర్ స్థానానికి), 24 మంది రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు.
ఎన్నికల నిర్వహణ ఇలా...
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మేయర్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ గురువారం జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి వెల్లడించారు. శనివారం (ఈ నెల 14) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాఖలు చేయవచ్చు. 16వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. 17 ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన, 19 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఏదైనా కారణంతో రీ పోలింగ్ అవసరమైతే 27వ తేదీన నిర్వహిస్తారు. నవంబర్ 30వ తేదీ ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు.
ఫ మోగిన ఎన్నికల నగరా
ఫ 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న వైనం
ఫ ఈ నెల 14 నుంచి
నామినేషన్ల స్వీకరణ
ఫ 19న ఉపసంహరణ, తుది జాబితా
ఫ 26న పోలింగ్, 30న కౌంటింగ్
నగర పాలక సంస్థలో ఓటర్లు


