అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ కె.లక్ష్మీశివజ్యోతిని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. ప్రస్తుతం ఆమె డిప్యూటేషన్‌పై గుంటూరులోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు దేవదాయ, ధర్మదాయ శాఖకు డిప్యూటేషన్‌పై పంపిస్తూ అన్నవరం దేవస్థానం ఈఓగా నియమించారు. ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ఒకటి, రెండ్రోజుల్లో దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇన్‌చార్జిగా వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మూడు ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం
పి.గన్నవరం: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్టు పి.గన్నవరం ఎస్సై ఇ.నరసింహమూర్తి బుధవారం తెలిపారు. మొండెపులంక నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా నాగుల్లంక గ్రామంవద్ద వాటిని పట్టుకున్నామన్నారు. ట్రాక్టర్ల యజమానులైన మొండెపులంకకు చెందిన ఇద్దరు, నాగుల్లంకకు చెందిన ఒకరిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


