ఫ వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
ఫ కౌంటింగ్ కేంద్రం నుంచి
వెళుతుండగా ఘటన
సీతానగరం: అధికార బలంలో విర్రవీగుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు విచక్షణారహితంగా వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడి చేశారు. మండలంలోని ఉండేశ్వరపురంలో శనివారం జరిగిన ఈ ఘటనలో వేమగిరి విజయ్ ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఉండేశ్వరపురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్ సీపీ ఓటమి చెందింది. దీంతో రాత్రి 7.30 గంటల సమయంలో రాజానగరంలోని కౌటింగ్ కేంద్రం నుంచి ఉండేశ్వరపురం సెంటర్ మీదుగా వేమగిరి విజయ్ ప్రకాష్ తదితరులు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఈ క్రమంలో సెంటర్‌లో ఉన్న టీడీపీ, జనసేన చెందిన పలువురు వీరిని రెచ్చకొట్టేలా పరుష పదజాలంలో దూషించారు. దీనితో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలపడంతో కూటమి కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో విజయ్ ప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన వేమగిరి నాగ మునేశ్వరరావు, వేమగిరి పెద రాంబాబు, వేమగిరి డేవిడ్‌తో పాటు సుమారు 50 మంది రోడ్డుపై బైఠా యించి నినాదాలు చేశా రు. సమాచారం అందుకున్న ఎస్సై ఎల్. శ్రీను నాయక్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ వారితో మాట్లాడి, గాయమైన విజయ్ ప్రకాష్‌ను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాని సూచించారు.


