వాళ్లు వేలంతో కొనేశారు.. జనం ఓటుతో తిప్పికొట్టారు.. | - | Sakshi
Sakshi News home page

వాళ్లు వేలంతో కొనేశారు.. జనం ఓటుతో తిప్పికొట్టారు..

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

● కూటమి కుట్రకు చెక్‌ పెట్టిన ఓటర్లు

● బుచ్చింపేటలో వైఎస్సార్‌ సీపీకి పట్టం

రాజానగరం: ఎన్నికల్లో పోటీ పడలేక దొడ్డి దారిలో గెలవాలనుకున్న కూటమి నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఓ ఎంపీటీసీ స్థానాన్ని వేలం పేరుతో దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని విఫలం చేశారు. డబ్బుతో విజయం సాధించాలనుకున్న వారి కుట్రను ఓటుతో తిప్పికొట్టారు. కోరుకొండ మండలం బుచ్చింపేట ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనపర్తి మణికంఠను 500 ఓట్ల మెజార్టీతో గెలిపించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. తద్వారా ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు.

వివరాలు ఇవీ..

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయక, పెరిగిన ధరలను నియంత్రించలేక, అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆ పార్టీల నాయకులు కుయుక్తులు పన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధి, మరో నాయకుడు కలిసి కోరుకొండ మండలం బుచ్చింపేట ఎంపీటీసీ స్థానాన్ని దక్కించుకోవడానికి కుట్ర పన్నారు. ఆ స్థానం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన అతడిని పోటీ నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. గ్రామంలోని దేవాలయం అభివృద్ధి నెపంతో కొందరు వేలం పాట నిర్వహించారు. ఎక్కువకు పాడుకున్న వారిని ఏకగ్రీవం చేయాలని భావించారు. తద్వారా కూటమి అభ్యర్థిని గెలిపించడానికి పథకం రచించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెంటనే ఆ గ్రామానికి చేరుకున్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మణికంఠకు అండగా నిలిచారు. కూటమి కుట్రను గమనించి గ్రామస్తులు కూడా ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేసి మణికంఠను గెలిపించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement