పవిత్ర కార్తిక మాసంలో నదీ స్నానాలకు విశేష ప్రాధాన్యం ఉంది. భక్తులు వేకువజామునే నదీలో పుణ్యస్నానాలు ఆచరించి, సమీపంలో ఆలయాలను సందర్శిస్తారు. అయితే కార్తిక మాసం ప్రారంభం అవుతున్నా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పుష్కర, కోటిలింగాల, సరస్వతి, వీఐపీ, గౌతమి ఘాటలలో ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దక్షిణ కాశీగా పేరొందిన కోటిలింగాల క్షేత్రంలో అయితే స్నానమాచరించలేని పరిస్థితి ఉంది. ఆ ఘాట్ బురదతో నిండిపోయి అపరిశుభ్రంగా మారింది. అక్కడి బురదను తొలగించి, స్నానమాచరించడానికి వీలుగా మార్చాలని భక్తులు వేడుకొంటున్నారు.
కోటిలింగాల ఘాట్లో పేరుకుపోయిన చెత్త


