బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇండోనేషియా టాంగెరాంగ్, లిప్పోలో ఉన్న యూపీహెచ్ యూనివర్సిటీ రోబోరోజ్–26 అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీల్లో ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన విద్యార్థుల బృందం పైలట్ విభాగంలో ప్రధమ స్థానం సాధించారు. అడ్డగళ్ల తులసి, దొడ్డి దత్త శ్రీకరి, జనపాల వైష్ణవీరావు, గాజువాక బ్రాంచ్ విద్యార్థులు ఘరాబిడి సతీష్, మహ్మద్ ఫైజాన్ ఈ పోటీల్లో ప్రతిభ చాటారు. శుక్రవారం ఆ విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి, కళాశాల కార్యదర్శి సుగుణారెడ్డి, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బీఇవీఎల్ నాయుడు, ప్రిన్సిపాల్ బ్యులా, మహిళ కళాశాల ప్రిన్సిపాల్ కరుణ వారిని అభినందించారు.


