ఫ రూ. 20 లక్షల నష్టం
ఫ తడిసిన పొగాకును క్యూరింగ్ చేస్తుండగా ఘటన
దేవరపల్లి: తుపాను వర్షాలకు తడిసిపోయిన పొగాకును బ్యారన్లో క్యూరింగ్ చేస్తుండగా, మంటలు వ్యాపించి సుమారు రూ.10 లక్షల విలువ గల పొగాకుతో పాటు, మరో రూ.10 లక్షలు విలువ గల బ్యారన్ దగ్ధమైంది. నల్లజర్ల మండలం పోతవరంలో సోమవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రైతు గద్దే తాతారావుకు చెందిన 30 పొగాకు బేళ్లు (సుమారు 40 క్వింటాళ్లు) ఇటీవల కురిసిన వరీ వర్షాలకు తడిచిపోయాయి. వాటిని ఆరబెట్టినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో తిరిగి బ్యారన్లో పెట్టి క్యూరింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పొగాకు క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాస్తూ ఆకులు రాలిపడటంతో అగ్ని ప్రమాదం జరిగి బేళ్లన్నీ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దీంతో పాటు బ్యారన్ కూడా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు.


