ద్వారకాతిరుమల: చిన్న వెంకన్న దర్శనార్థం స్కూటీపై వెళుతున్న ఇద్దరు మహిళలు సోమవారం రాత్రి స్థానిక నిమ్మకాయల మార్కెట్ యార్డు వద్ద రోడ్డుపై ఉన్న గుంతలోపడి తీవ్ర గాయాల పాలయ్యారు. ఏలూరుకు చెందిన ఎం.పద్మ, ఎం.రాజేశ్వరి స్కూటీపై ద్వారకాతిరుమల క్షేత్రానికి వెళుతున్నారు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి స్కూటీ గుంతలో పడటంతో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. వారిని కామవరపుకోట అంబులెన్స్‌లో భీమడోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పాపికొండలకు 39 మంది పర్యాటకులు
దేవీపట్నం: గోదావరిపై బోటు ప్రయాణం చేస్తూ పాపికొండల అందాలను వీక్షించేందుకు సోమవారం 39 మంది పర్యాటకులు తరలివెళ్లారు. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వీరందరూ రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మీదుగా వాహనాల్లో పోశమ్మగండికి తరలివచ్చారు. తనిఖీల అనంతరం ఒక బోటులో 39 మంది పర్యాటకులు పేరంటపల్లికి వెళ్లారు. నిర్దేశించిన సమయానికి సాయంత్రం తిరిగి పోశమ్మగండికి చేరుకున్నారు.
కడుపునొప్పితో
వ్యక్తి మృతి
రౌతులపూడి: మల్లంపేట సమీపంలోని ఒక స్టోన్ క్రషర్ వద్ద ఉంటున్న మహమ్మద్ అక్రమ్ (21) సోమవారం మృతి చెందాడు. అతడు రెండు రోజులుగా క్రితం కడుపు నొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరాడు. స్థానికులు వెంటనే చికిత్స కోసం రౌతులపూడి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
రోడ్డు ప్రమాదంలో
వడిశలేరు యువకుడు..
బాన్సువాడ రూరల్(తెలంగాణ): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు గ్రామానికి చెందిన చల్లా డేవిడ్‌రాజు (26) ఆదివారం సాయంత్రం తన బంధువు మూర్తిరామ్తో కలిసి బైక్‌పై కామారెడ్డి జిల్లా మహ్మద్‌నగర్ నుంచి బోధన్ వైపు వెళ్తున్నాడు. సోమేశ్వర్ గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి బైక్‌పై అతివేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో డేవిడ్‌రాజుకు తీవ్రగాయా లు కాగా, మూర్తిరామ్కు స్వల్పగాయాలయ్యా యి. వెంటనే స్థానికులు డేవిడ్‌రాజును బాన్సువా డ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించాడు. మృతుడి మేనమామ పాఠంశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
మొండెపులంకలో
కారు దగ్ధం
పి.గన్నవరం: రాజవరం – పొదలాడ ప్రధాన రహదారిపై పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద సోమవారం రాత్రి కారు దగ్ధమైంది. సకాలంలో స్పందించిన స్థానికులు కారులోని భార్యాభర్తలను రక్షించారు. వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన ఎ.వెంకటపతిరాజు దంపతులు సోమవారం ఉదయం భీమవరం, అజ్జరం మీదుగా రాజమహేంద్రవరం వెళ్లి అక్కడ దుస్తులు కొనుగోలు చేశారు. అనంతరం పి.గన్నవరం మీదుగా ఇంటికి తిరిగి వెళుతుండగా మొండెపులంక వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి కారులోని దంపతులను బయటకు లాగి రక్షించి, మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కారు ఇంజిన్ భాగం దగ్ధమైంది.
నేడు ఖోలో ఇండియా యూత్ గేమ్స్ ఎంపికలు
ప్రకాశం నగర్(రాజమహేంద్రవరం): తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక మంగళవారం నిర్వహించనున్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డీఎంఎం శేషగిరి సోమవారం సాయంత్రం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. కాకినాడలో ఖోఖో (బాల బాలికలు), గుంటూరులో కబడ్డీ (మెన్స్) (70 కేజీల) విభాగంలో, భీమవరంలో మల్లకంబ్ (బాలబాలికలు) పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి కల జిల్లా క్రీడాకారులు సంబంధిత జిల్లాల్లో ఉదయం 8.30 గంటలకు పదో తరగతి మార్కులు సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు, జనన ధ్రువీపత్రాలతో హాజరుకావాలన్నారు. 1–1–2009 తర్వాత జన్మించిన వారు ఈ పోటీలకు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 87126 22568 (కాకినాడ), 81431 43222 (గుంటూరు), 96405 03679 (భీమవరం) ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.


